Viral Video: గజరాజుకు కోపం వస్తే ఎట్లుంటదో తెలుసా? రోడ్డుపై బీభత్సం.. వీడియో వైరల్
Viral Video: ఈ సంఘటన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అటవీ శాఖ బృందానికి సమాచారం అందించారు. వారు ఏనుగును పట్టుకుని అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలు భయపడిపోయారు. వీలైనంత త్వరగా ఏనుగును నియంత్రించాలని అటవీ..

Viral Video: అస్సాంలోని గువహతిలోని అమ్‌చాంగ్-జోరాబాత్ ప్రాంతంలో గాయపడిన కాలుతో ఏనుగు గత కొన్ని రోజులుగా అమ్‌చాంగ్, జోరాబాత్, సత్గావ్ ప్రాంతాలలో తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తోంది. ఆగస్టు 12న ఈ ఏనుగు కోపంతో ఒక కారుపై దాడి చేసింది. దీని కారణంగా కారు పూర్తిగా దెబ్బతింది. అయితే, ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఓరి దేవుడా.. గాలికిపోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనేమో.. అసలు ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాంకే
ఏనుగు దాడి చేసినప్పుడు కారులో ఎవ్వరు లేరు:
ఏనుగు తన తొండం, కాళ్ళను ఉపయోగించి కారును దెబ్బతీసిందని, అయితే ఏనుగు దాడి చేసిన సమయంలో కారులో ఎవరు లేనందున తృటిలో ప్రమాదం తప్పిందని కారు యజమాని తెలిపాడు. దాడి జరిగిన సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ దాడిని మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏనుగు దాడి వీడియో వైరల్ అవుతోంది.
అటవీ శాఖ సిబ్బందికి సమాచారం:
ఈ సంఘటన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అటవీ శాఖ బృందానికి సమాచారం అందించారు. వారు ఏనుగును పట్టుకుని అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలు భయపడిపోయారు. వీలైనంత త్వరగా ఏనుగును నియంత్రించాలని అటవీ శాఖను డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం జనసాంద్రత ఎక్కువగా ఉండటం, ఏనుగు దూకుడు ప్రవర్తన ముప్పును కలిగిస్తోంది. ఏనుగు భయం కారణంగా స్థానిక ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి: Telangana: 18 ఏళ్లు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 13 వరకు అవకాశం!
మరిన్ని ట్రెండ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




