Telangana: 18 ఏళ్లు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 13 వరకు అవకాశం!
Telangana: రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా, పసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు..

Telangana: తెలంగాణ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా, పసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం రైతు బీమా పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన పథకాల్లో ఒకటైన ‘రైతు బీమా’కు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఆగస్ట్ 13. ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం రైతులకు సూచించింది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, అలాగే గతంలో పాస్ బుక్ ఉన్నప్పటికీ ఈ స్కీమ్‌లో చేరని వారికి కూడా అవకాశం ఇస్తోంది. ఆగస్ట్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇదేం పోయే కాలం.. ఇలాంటి వాళ్లను ఏమనాలి బ్రో.. రీల్ కోసం చీరకే నిప్పటించుకుంది
ఇది కూడా చదవండి: Today Gold Price: మహిళలకు పండగలాంటి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇదిలా ఉండగా, ఈ రైతు బీమా పథకాన్ని ఆగస్ట్ 14, 2018లో ప్రారంభమైంది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు మరణమైనా ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఎల్ఐసి (LIC) కి ప్రీమియం చెల్లిస్తుంది. మొదటి సంవత్సరంలో ఒక్కో రైతుకు రూ. 2,271.50 చొప్పున ప్రీమియం చెల్లించింది ప్రభుత్వం. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం మొత్తం పెరుగుతూ వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తోంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్
- రైతు బీమా దరఖాస్తు ఫారం
- పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ (లేదా MRO డిజిటల్ సంతకంతో కూడిన DS పేపర్).
- రైతు ఆధార్ కార్డు
- నామినీ ఆధార్ కార్డు.
- రైతు వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ సంవత్సరం 2025-26 బీమా సంవత్సరం ఆగస్టు 14 నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు అప్లికేషన్ చేసుకున్నవారి పేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు.. ఈ వీడియో చూస్తే కన్నీరు పెట్టక మానరు!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








