AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు.. ఈ వీడియో చూస్తే కన్నీరు పెట్టక మానరు!

Heartbreaking Video: రోడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోవటానికి రోడ్డు దాటించడానికి తల్లి ఎలుగు బంటి చాలా కష్టాలే పడింది. అయితే పిల్ల ఎలుగు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చివరకు చనిపోయింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది..

Viral Video: ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు.. ఈ వీడియో చూస్తే కన్నీరు పెట్టక మానరు!
Subhash Goud
|

Updated on: Aug 11, 2025 | 3:04 PM

Share

Heartbreaking Video: సాధారణం చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటే కొన్ని వీడియోలు షాకింగ్‌కు గురి చేసేలా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలు హృదయాలను కదిలించేలా ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సమాజంలో మనుషుల్లో గానీ, జంతువుల్లో గానీ తల్లి పాత్ర అంతా ఇంతా కాదు. పిల్లలకు ఏమైనా జరిగితే తల్లి తల్లడిల్లిపోతుంది. అది జంతువుల్లోనూ కనిపిస్తుంటుంది.

పిల్లలు బాగుంటే తల్లికి ఉండే ఆనంతం అంతా ఇంతా కాదు. పిల్లల కోసం ఎంత కష్టానికైనా వెనుకాడదు తల్లి. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిల్లాడిపోతుంటుంది. ఇలాంటివి మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా తల్లి ఎలుగు బంటితో కలిసి రోడ్డు దాటుతున్న పిల్ల ఎలుగు బంటి రోడ్డు ప్రమాదానికి గురైంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Viral Video: ఇదేం పోయే కాలం.. ఇలాంటి వాళ్లను ఏమనాలి బ్రో.. రీల్‌ కోసం చీరకే నిప్పటించుకుంది

రోడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోవటానికి రోడ్డు దాటించడానికి తల్లి ఎలుగు బంటి చాలా కష్టాలే పడింది. అయితే పిల్ల ఎలుగు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చివరకు చనిపోయింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి ఓ తల్లి ఎలుగు బంటి తన రెండు పిల్లలతో కలిసి షాహ్‌దోల్ జిల్లాలోని బరీ డ్రేన్ సమీపంలో జోహ్‌పారు – జైత్‌పూర్ రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఒక పిల్ల ఎలుగుబంటిని ఢీకొట్టింది. రోడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న బిడ్డను కాపాడుకోవటానికి, రోడ్డు దాటించడానికి తల్లి ఎలుగు బంటి చాలా కష్టపడింది. అయితే పిల్ల ఎలుగు బంటి గాయాల కారణంగా చనిపోయింది.

ఇది కూడా చదవండి: Health Tips: 15 రోజులు టీ తాగడం మానేస్తే మీ శరీరంలో జరిగే కీలక మార్పులు ఇవే!

పాపం తల్లి ఎలుగు బంటి పిల్లను అలా చూసి విలవిల్లాడిపోయింది. రోడ్డుపై వాహనాలు వస్తుండటంతో పిల్లను రోడ్డు దాటించడానికి చాలా ఇబ్బంది పడింది. చాలా సేపు పిల్ల కోసం అక్కడే ఉండిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పిల్ల ఎలుగు బంటిని చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ, అది మాత్రం బతకలేదు. చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారి హృదయాలను సైతం కదిలిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి