Viral Video: ఓరి దేవుడా.. గాలికిపోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనేమో.. అసలు ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాంకే
Viral Video: ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లలో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొంతమంది ఆవు రక్షకుడికి మద్దతు ఇస్తుండగా, మరోవైపు కుక్క ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు ఈ సంఘటనను విమర్శిస్తున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..

వీధికుక్కల భయానక వాతావరణం మధ్య, సోషల్ మీడియాలో ఒక సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని చూసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైరల్ ఫుటేజ్‌లో మొదట ఒక వీధికుక్క ఆవుపై దాడి చేసింది. అంతలోనే ఓ వ్యక్తి అటు నుంచి స్కూటర్‌పై వెళ్తున్నాడు. కుక్క ఆవును కరిచిన దృశ్యాన్ని చూసిన ఆ వ్యక్తి కర్రతో కుక్కను కొట్టాడు. వెంటనే కుక్క పడిపోయింది. ఈ సీన్‌ను చూసిన మరో వ్యక్తి అక్కడికి హడావుడిగా చేరుకుని కుక్కను ఎందుకు కొట్టావని ఈ స్కటర్‌పై ఉన్న వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దదైపోయింది. ఇక ఇదిలా ఉంటే పడిపోయిన కుక్క లేచి స్కూటరిస్ట్‌తో గొడవకు దిగిన వ్యక్తిని కాటేసింది.
A dog bites a cow, cow lover knocks it out, dog lover argues, dog wakes up and bites the dog lover. Street drama at its finest.😬☠️🫠https://t.co/1V7xg6owDP
— Bulla👺 (@Bulla724) August 9, 2025
ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లలో కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు కొంతమంది ఆవు రక్షకుడికి మద్దతు ఇస్తుండగా, మరోవైపు కుక్క ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు ఈ సంఘటనను విమర్శిస్తున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే కుక్కను కొట్టినందుకు కుక్క తరపున గొడవకు దిగిన వ్యక్తినే కాటేసింది కుక్క. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని సమయాల్లో అవసరం లేని విషయాల్లో దాలదూర్చితే ఇలా ఉంటుంది. పాపం ఆ వ్యక్తి కుక్క తరపున గొడవకు దిగితే చివరకు ఆయనపైనే దాడి చేసింది. అందుకే గాలికిపోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఇది కూడా చదవండి: Stag Beetle: ఈ కీటకం రూ. 75 లక్షలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాకవుతారు!
ఇది కూడా చదవండి: Telangana: 18 ఏళ్లు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 13 వరకు అవకాశం!
మరిన్ని ట్రెండ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




