AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆఫీసులో మ్యారేజ్ డే సెలబ్రేషన్స్.. భార్యతో స్టెప్పులు.. కట్ చేస్తే..!

విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులే తప్పటడుగులు వేస్తున్నారు. క్లాస్ రూమ్‌లో భార్యతో రోమాన్స్ చేసిన అధికారిపై వేటు పడింది. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన బ్లాక్ ప్రాథమిక విద్య అధికారిని మంగళవారం(ఆగస్టు 12) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు.

Viral Video: ఆఫీసులో మ్యారేజ్ డే సెలబ్రేషన్స్.. భార్యతో స్టెప్పులు.. కట్ చేస్తే..!
Moga Bpeo Devi Prasad Dance In Office
Balaraju Goud
|

Updated on: Aug 13, 2025 | 4:11 PM

Share

విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులే తప్పటడుగులు వేస్తున్నారు. క్లాస్ రూమ్‌లో భార్యతో రోమాన్స్ చేసిన అధికారిపై వేటు పడింది. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన బ్లాక్ ప్రాథమిక విద్య అధికారిని మంగళవారం(ఆగస్టు 12) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. అందులో అతను తన భార్యతో కలిసి తన కార్యాలయంలో డాన్స్ చేస్తూ కనిపించారు.

దేవి ప్రసాద్‌ బ్లాక్ ప్రాథమిక విద్యా అధికారిగా బాఘపురాణ ఉప జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ వీడియోలో ప్రసాద్ దుష్ప్రవర్తనకు గాను ఆయనను సస్పెండ్ చేసినట్లు విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ జోక్యం తర్వాత విద్యా కార్యదర్శి అనిందిత మిత్రా ఈ చర్య తీసుకున్నారు. “ఏ అధికారి అయినా నిబంధనలను ఉల్లంఘించినా లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించినా సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటాము” అని మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ హెచ్చరించారు.

మోగాకు చెందిన విద్యా శాఖ అధికారి దేవి ప్రసాద్ తన భార్యతో కలిసి ఆఫీసు ఆవరణలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ వీడియోను ఆయన భార్య యూట్యూబ్ ఛానెల్ @IndianExpress @iepunjab @ieeducation_job pic.twitter.com/YkYojRGkDH లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. తన భార్యకు యూట్యూబ్ ఛానల్ ఉందని, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ముందు తన పిల్లలు అక్కడ అప్‌లోడ్ చేశారని దేవి ప్రసాద్ తెలిపారు.

వీడియో చూడండి..

వీడియో బయటకు వచ్చిన వెంటనే, ఆ అధికారికి షో కాజ్ నోటీసు జారీ చేశామని మోగా డిప్యూటీ కమిషనర్ సాగర్ సేటియా చెప్పారు. ఈ వీడియో కేవలం ఒక నిమిషం మాత్రమే ఉంది. కానీ తరువాత దానిని ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేశారు. ఈ వీడియోలో, అధికారి, అతని భార్య ‘తుమ్ రూథి రహో, మై మనతా రహో’ అనే బాలీవుడ్ పాటకు డాన్స్ చేశారు.

ఆ వీడియో జూలై నాటిదని దేవి ప్రసాద్ అన్నారు. ఆ సమయంలో ఎన్నికల విధుల్లో ఉన్నానని తెలిపాడు. ఈ వీడియో చిత్రీకరించిన రోజు, తమ వివాహ వార్షికోత్సవం కావడంతో తన భార్య తనతో ఉందని తెలిపాడు. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే చేసిందని వివరణ ఇచ్చుకున్నాడు. తాను తన కుటుంబంతో ఆఫీసులో కొన్ని గంటలు గడిపానని, ఆ సమయంలో వీడియో చిత్రీకరించానని ఆయన పేర్కొన్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..