AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇద్దరు పిల్లలు ప్రమాదకరమైన ఆట. 13వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతున్న పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్

ఇద్దరు చిన్న పిల్లలు ఒక ఎత్తైన భవనం బాల్కనీ నుంచి వేలాడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు షాక్ అయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @nihaochongqing అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. రకరకాల కామెంట్స్ తో తమ ఫీలింగ్స్ ని తెలియజేస్తున్నారు. ఈ వీడియో పొరుగు దేశమైన చైనాకి సంబంధించినదని తెలుస్తోంది.

Viral Video: ఇద్దరు పిల్లలు ప్రమాదకరమైన ఆట. 13వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతున్న పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్
Kids Hanging From 13th Floor Balcony
Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 3:25 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇంటర్నెట్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆందోళనకు గురిచేసింది. ఈ వీడియో చైనాలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌కు సంబంధించినదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలు 13వ అంతస్తు బాల్కనీ నుంచి చాలా ప్రమాదకరమైన రీతిలో వేలాడుతూ కనిపించారు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన తర్వాత అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈ వీడియోలో 13వ అంతస్తులోని బాల్కనీ నుంచి ఇద్దరు పిల్లలు వేలాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంతలో వేలాడుతున్న ఒక పిల్లవాడు చేసిన పని చూసి ప్రజల షాక్ తిన్నారు. ఎందుకంటే పిల్లవాడు రైలింగ్ నుంచి వేలాడడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

ఆ పిల్లలను సురక్షితంగా రక్షించారా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా అనేది వీడియో చివర్లో స్పష్టంగా లేదు. ఎందుకంటే అంత ఎత్తు నుంచి పిల్లలు కిందకు పడిపోవడం అంటే మరణాన్ని ఆలింగనం చేసుకోవడం. అయితే వారిద్దరూ సురక్షితంగా ఉండి ఉంటారని నెటిజన్లు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ భయానక దృశ్యాన్ని పక్క ఇంటి వ్యక్తి రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. వైరల్ క్లిప్‌లో ఇద్దరు పిల్లలు రైలింగ్‌ను గట్టిగా పట్టుకున్నట్లు కనిపించినప్పటికీ.. పిల్లల చర్య వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. దీని కారణంగా నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు. తల్లిదండ్రుల తీరుని విమర్శిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @nihaochongqing అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రజలు నిరంతరం తమ ప్రతిచర్యలను తెలియజేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు.. వారిని జైలులో పెట్టాలని ఒకరు.., “ఓ మై గాడ్! ఈ వీడియో చూసినప్పుడు నేను వణికిపోయాను అని మరొకరు.. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి వారు అసలు పిల్లలు సురక్షితంగా ఉన్నారా?” అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..