Viral: బిక్కుబిక్కుమంటూ ఇంటికి చేరిన బాలిక.. ఏది తిన్నా వికారం.. ఆస్పత్రికి తీసుకెళ్లగా
ఆ బాలిక రాత్రి ఎప్పుడూ ఇంటికొచ్చింది. ఫ్రెండ్స్‌తో ఆడుకుని వచ్చిందిగా అని సదరు బాలిక కుటుంబసభ్యులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి భోజనం చేయడానికి రమ్మని పిలిస్తే.. ఆమె బిక్కుబిక్కుమంటూ వచ్చింది. ఏం జరిగిందా అని అడగ్గా.. అసలు విషయం బయటపడింది.

తన అన్నతో కలిసి ఆడుకుంటూ తాళం మింగేసిన ఆరేళ్ల బాలికను ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. సాయంత్రం అన్నతో కలిసి ఆడుతుండగా.. అక్కడే దొరికిన తాళంను నోట్లో పెట్టుకుని పొరపాటున మింగేసింది ఆ చిన్నారి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ తనను కొడతారోనని భయపడి.. విషయాన్ని దాచిపెట్టింది. ఏమి తెలియనట్టుగా సైలెంట్‌గా ఉంది. బిక్కుబిక్కుమంటూ ఇంటికి చేరింది. డిన్నర్ టైంలో కుటుంబసభ్యులకు చెప్పగా.. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు చిన్నారిలో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. ఆమె తల్లి.. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్స్ చేయించింది.
ఇక ఎక్స్‌రేలో చిన్నారి పొత్తికడుపులో తాళం ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ తాళం ద్వారా చిన్నారి శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, అలాగే నెగటివ్ లక్షణాలు ఏం ఆమెలో కనిపించకపోవడంతో.. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తాళం తొలగించడానికి ప్రయత్నించకుండా.. చిన్నారిని పర్యవేక్షణలో ఉంచారు.
72 గంటల పాటు చిన్నారిని పర్యవేక్షణలో ఉంచారు. టైం టూ టైం ఎక్స్‌రేలు తీసి.. ఆ తాళం శరీరం గుండా ఎలా ప్రయాణిస్తోందా అని గమనించారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్చిన 48 గంటల తర్వాత ఆ తాళం పేగుల గుండా వెళ్తున్నట్టు ఎక్స్‌రేలో గమనించారు డాక్టర్లు. 72 గంటల తర్వాత ఆ చిన్నారికి ఎటువంటి సమస్యలు లేకుండా మలద్వారం గుండా తాళం బయటకు వచ్చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ ఘటన వల్ల చిన్నారికి ఎటువంటి దుష్ప్రభావాలు కలగలేదు. ఆమెను ఆ తర్వాత కొద్దిరోజులకే డిశ్చార్జ్ చేశారు. ఈక్వెడార్‌లో ఈ ఘటన జరగ్గా.. ఆ చిన్నారి ఎలాంటి సమస్యలు లేదని వైద్య బృందం స్పష్టం చేసింది.
ఇది చదవండి: ఆ ఇంటి తలుపు గడియ తీసి ఉంది.. లోపలికి వెళ్లి చూస్తే.. ఓ అమ్మాయి అదేపనిగా
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
