Viral: ఆ ఇంటి తలుపు గడియ తీసి ఉంది.. లోపలికి వెళ్లి చూస్తే.. ఓ అమ్మాయి అదేపనిగా
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంటికొచ్చాడు.. ఎవరు మీరు అని.. ఇంట్లో ఉన్నవాళ్లు అడగగా.. ఈలోపే జరగాల్సింది జరిగిపోయింది. అసలు ఈ మ్యాటర్ ఏంటి.? అసలు ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

దేశవ్యాప్తంగా రోజురోజుకూ చోరీలు పెరిగిపోయాయి. దొంగతనాలు, దోపిడీలు నిత్యకృత్యంగా మారాయి. దోపిడీల్లోనూ ఒక్కో దొంగ ఒక్కో శైలిని ఫాలో అవుతాడు. ఒకరు మారువేషంలో వస్తే.. మరొకరు మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి తెగబడుతున్నారు. కొందరు మహిళలు హనీట్రాప్‌తో మాయ చేస్తుంటే.. ఇంకొందరు ఏకంగా మగాడి వేషంలో చెలరేగిపోతున్నారు. అలాంటిదే ముంబైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్ర ముంబై వసి ప్రాంతానికి చెందిన ఓ యువతి.. ఏకంగా తన అక్క ఇంటికే ఎసరు పెట్టింది. వాళ్ల అక్క అత్తింటివారి ఇంట్లోకి దూరి.. చోరీకి తెగబడింది. మగవాడి వేషంలో వచ్చి ఇల్లంతా దోచేసింది. సుమారు రూ. కోటిన్నర విలువైన నగలు ఎత్తుకెళ్లింది. అంతేకాదు ప్రతిఘటించిన మామను కట్టేసి బాత్రూంలో బంధించింది. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. 12 గంటల్లోనే దొంగను గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా జ్యోతి అనే నిందితురాలిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మగవాడి వేషంలో వచ్చి దోపిడీ చేసినట్లు తేల్చారు. నిందితురాలి నుంచి కోటిన్నర విలువైన నగలు రికవర్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆదేశాల ప్రకారం రిమాండ్‌కు తరలించారు.
ఇది చదవండి: కడుపు ఉబ్బి.. చిత్రవిచిత్ర శబ్దాలతో ఆస్పత్రికి.. భయంతో ఎక్స్‌రే తీయగా.. అందులో పొడవైన
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
