AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో రామా.. రేబీస్ సోకితే ఆఖరి క్షణాల్లో ఇలా ప్రవర్తిస్తారా..! వీధి కుక్కలతో జాగ్రత్త సుమా..

గత కొంతకాలంగా పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనుష్యులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెత్తుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయం లోనైనా రోడ్ల మీద నడుచుకుంటూ వేళ్లే వారిపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే స్థానికులు వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. అయితే కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి సోకుతుందని తెలిసిందే.. ఇటీవల కుక్కని కాపాడి.. ఆ కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి సోకి మరణించిన మన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ లాస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే వీధి కుక్కలకు వీలైంత దూరంగా ఉంటారు..

Viral Video: అయ్యో రామా.. రేబీస్ సోకితే ఆఖరి క్షణాల్లో ఇలా ప్రవర్తిస్తారా..! వీధి కుక్కలతో జాగ్రత్త సుమా..
Viral Video
Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 12:30 PM

Share

కొన్ని వీధుల్లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరుపై దాడి చేస్తూ తరచుగా గాయపరుస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. వీధి కుక్కల బారి నుంచి తమని రక్షించమని వాటిని నిర్మూలించమని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు.. హైదరబాద్, బెంగళూరు, పూనే వంటి పెద్ద పెద్ద నగరాల్లో నివసించే యువతీయువకులు వీధి కుక్కలను చేరదీసి.. వాటికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఇలా జాలితో వీధి కుక్కలను చేరదీయడం వారి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు ఎంత ప్రేమ చూపించినా అవి దాడి చేస్తే.. రేబిస్ సోకే ప్రమాదం ఉందని.. ఒకొక్క సారి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రేబిస్ వ్యాధి సోకితే ఆ వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేస్తూ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో ఒకటి కబాడీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి చెందినది.

ఇవి కూడా చదవండి

యూపీకి చెందిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలం ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. బ్రిజేష్ సోలంకి ఒక వీధి కుక్కను రక్షించాడు. అయితే మురికి నీటి లో పడిన ఓ కుక్కని రక్షించాడు. ఆ కుక్కే బ్రిజేష్ ని కరిచింది. అయితే ఈ విషయం అతను గమనించ లేదు.. తన చేతిమీద గాయం కబాడీ ఆడుతున్న సమయంలో తగిలిందని భావించాడు. దీంతో అతనికి రేబిస్ వ్యాధి సోకింది. ఎంత వైద్యం చేసినా వైద్యులు రేబిస్ వ్యాధిని నయం చేయలేకపోయారు. చివరకు బ్రిజేష్ నీటిని చూసి భయపడడం, కుక్క మాదిరి పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తమ కొడుకు పరిస్థతి చూసి ఆహాయ స్థితిలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చివరికి ఆ వ్యాధే అతడి ప్రాణాలు తీసింది. బ్రిజేష్ చివరి సమయంలో పడిన బాధకి సంబంధించిన ఒక వీడియోనూ మేఘ్ అప్డేట్స్ అనే ఎక్స్ హ్యాండిల్లో యూజర్ పోస్ట్ చేశారు.

ఈ వీడియోకి జతగా రేబిస్ సోకిన మరొక యువతికి సంబంధించిన వీడియో కూడా ఉంది. అందులో రేబీస్ సోకినా యువతి మంచానికి కట్టేసి ఉంది. ఆమె గిల గిలా కొట్టుకుంటుంది. కూతురు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కనుక అయ్యో పాపం అంటూ వీధికుక్కలను చేర దీసే ముందు జాగ్రత్తగా ఉండండి. లేదంటే… అవి రేబీస్ వ్యాధి రూపంలో మీ ప్రాణాలను అత్యంత దారుణంగా హరించే అవకాశం ఉంది.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..