Sun Transit: త్వరలో సొంత రాశిలోకి అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
నవ గ్రహాలకు సూర్యుడు అధినేత. ప్రతి నెలకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. ఆ రోజున సంక్రాంతి అని అంటారు. త్వరలో సూర్యుడు తన సొంత రాశిలో సంచారము చేయబోతున్నాడు. సూర్య సంచారము అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సూర్య సంచారము వల్ల ఏ రాశుల వారు అదృష్టవంతులు కానున్నారో తెలుసుకోండి..
Updated on: Aug 13, 2025 | 1:53 PM

గ్రహాలకు రాజు అయిన సూర్య దేవుడు ప్రతి నెలా తన నిర్ణీత సమయంలో సంచారము చేస్తాడు. ఆగస్టు 17న సూర్య దేవుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఈ రోజున..సూర్యుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 17న ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడింది. ఈ ప్రత్యేక రోజున సూర్యుడు తన రాశిచక్రాన్ని మార్చుకోవడం అది శుభ యాదృచ్చికంగా పరిగణించబడుతుంది. ఆదివారం సూర్యదేవుడు తన సొంత రాశి సింహరాశిలో అడుగు పెట్టనున్నాడు. ఇది అనేక రాశులకు శుభాలను కలుగజేయవచ్చు. సూర్యుని సంచారము అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశులకు చెందిన వ్యక్తులే ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు.

మేషరాశి- సింహరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో మేషరాశి వారి విశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు పొందవచ్చు. ఈ సమయం వీరికి శుభప్రదం. చేసే పనిలో శ్రద్ధ పెట్టండి. పెద్దలను గౌరవించండి.

తుల రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో విదేశీ యాత్రకు వెళ్ళవచ్చు. కృషికి తగిన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఏర్పడనున్నాయి.

మిథున రాశి - సింహరాశిలో సూర్య సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చు. ప్రేమ జీవితంలో భాగస్వామి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు మీతోనే ఉంటారు.

మేషరాశి- సింహరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో మేషరాశి వారి విశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు పొందవచ్చు. ఈ సమయం వీరికి శుభప్రదం. చేసే పనిలో శ్రద్ధ పెట్టండి. పెద్దలను గౌరవించండి.




