AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

janmashtami: జన్మాష్టమి నాడు ఈ ఒక్కటి ఇంటికి తీసుకురండి.. అపార ప్రయోజనాలు మీ సొంతం, ఖాళీ ఒడి నిండిపోతుంది

శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటి కృష్ణుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ద్వాపర యుగంలో భూమిపై జన్మించాడు. కన్నయ్య పుట్టిన రోజుని కృష్ణ జన్మాష్టమి రోజుని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఇంట్లో సుఖ సంతోషాల కోసం.. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరిగేందుకు జన్మాష్టమి రోజున చేసే కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదంఅని.. అదృష్టం తలుపులు తెరుస్తాయని పురాణ కథ. ఈ రోజు కృష్ణాష్టమి రోజున కన్నయ్య అనుగ్రహం కోసం ఒక్క వస్తువుని తీసుకుని రండి.. విశేష ప్రయోజనాలు పొందండి.

janmashtami: జన్మాష్టమి నాడు ఈ ఒక్కటి ఇంటికి తీసుకురండి.. అపార ప్రయోజనాలు మీ సొంతం, ఖాళీ ఒడి నిండిపోతుంది
Janmashtami
Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 11:13 AM

Share

జన్మాష్టమి పండుగ శ్రీ కృష్ణుని భక్తి, ప్రేమ, లీలల వేడుక. శ్రీ కృష్ణుడి వేణువును ఆయన గుర్తింపు , ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగానే కాదు వాస్తు శాస్త్రంలో వేణువును చాలా శుభకరమైన, ప్రయోజనకరమైన వస్తువుగా భావిస్తారు. జన్మాష్టమి రోజున వేణువును ఇంటికి తీసుకువచ్చి సరైన స్థలంలో ఉంచితే..అది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాదు అదృష్టం , శ్రేయస్సు ద్వారాలను తెరుస్తుందని నమ్మకం. జన్మాష్టమి శుభ సందర్భంగా వేణువును ఉంచుకోవడం కేవలం ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే కాదు.. జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సు తీసుకురావడానికి ఇది సులభమైన మార్గం. ఈసారి జన్మాష్టమి నాడు వేణువును తీసుకు తెచ్చుకోండి.. శ్రీ కృష్ణుడి ఆశీస్సులతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు మీ సొంతం..

వేణువు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శ్రీమద్ భాగవతం, పురాణాలలో శ్రీకృష్ణుని వేణువు మధురమైన రాగం గోపికల మనస్సులలో ప్రేమ, ఆనందం, భక్తిని మేల్కొలిపేదని ప్రస్తావించబడింది. ఈ మురళీ కేవలం సంగీతాన్ని మాత్రమే కాదు, సానుకూల శక్తిని ప్రసారం చేసేది. అందుకే ఇంట్లో వేణువును ఉంచుకోవడం శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందడంతో సమానమని భావిస్తారు.

ఇంట్లో వేణువు ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

  1. ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది: వాస్తు శాస్త్రంలో వేణువు ‘సానుకూల ప్రకంపనలకు’ మూలంగా చెప్పబడింది. ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో వేణువు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి . ఇంట్లో శాంతిని కాపాడుతుంది.
  2. కుటుంబ సంబంధాలలో తీపి: గోపికల హృదయాలను దోచుకోవడానికి వేణువు మధురమైన శబ్దం ఎలాగైతే ఉపయోగపడిందో.. అలాగే వేణువుని ఇంట్లో పెట్టుకుంటే పరస్పర ప్రేమ, అవగాహనను పెంచుతుంది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను కూడా తగ్గించవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆర్థిక స్థితిలో మెరుగుదల: ఇత్తడి లేదా చెక్క వేణువుకి ఎరుపు లేదా పసుపు దారాన్ని కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తగ్గుతుంది.
  5. సంతానం పొందడంలో సహాయం: పిల్లలు కావాలని కోరుకునే జంటలు జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి పసుపు రంగు వేణువును సమర్పించి.. తరువాత దానిని పూజ గదిలో పెట్టుకోవడం శుభప్రదం అని నమ్ముతారు. ఈ పరిహారం వలన కన్నయ్య అనుగ్రహంతో పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుందని నమ్మకం.
  6. వృత్తి, వ్యాపార వృద్ధి: ఆఫీసులో లేదా కార్యాలయంలో వేణువు ఉంచుకోవడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు లభిస్తాయి.
  7. మెరుగైన ఆరోగ్యం: వేణువు ధ్వనిలోని ప్రతీకాత్మక శక్తి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఇంట్లో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  8. సంపద పెరుగుదల: జన్మాష్టమి నాడు తెచ్చిన వేణువును ఏడాది పొడవునా ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కొత్త అవకాశాలను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది.

ఎటువంటి వేణువు ఎక్కడ పెట్టుకోవాలంటే పదార్థం: చెక్క లేదా ఇత్తడి వేణువు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

స్థానం: తూర్పు, ఈశాన్య లేదా పూజ గదిలో ఉంచండి.

విధానం: జన్మాష్టమి రోజున, వేణువును గంగా జలంతో శుభ్రం చేసి పసుపు లేదా ఎరుపు దారాన్ని కట్టి, శ్రీకృష్ణుని పాదాల వద్ద సమర్పించండి.

నియమం: వేణువును నేలపై ఉంచవద్దు.. ఎల్లప్పుడూ ఎత్తైన ప్రదేశంలో ఉంచండి.

వేణువు కృష్ణుడి ప్రేమకు సంబంధించిన పురాణ కథ

శ్రీకృష్ణుడు తన వేణువును వాయించినప్పుడల్లా బృందావనంలోని గోపికలు అన్నీ వదిలి ఆయన వైపు వచ్చేవారని చెబుతారు. ఆ వేణువు రాగం కేవలం సంగీతం కాదు, ఆత్మ , భగవంతుని కలయికకు పిలుపు. అందుకే వేణువును ప్రేమ, భక్తి , ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు.

వేణు గానంతో యమునా నది శుద్ధి యమునా నదిలో నివసించిన కాళీయ నాగు తన విషపూరిత శ్వాసతో మొత్తం పర్యావరణాన్ని విషపూరితం చేశాడు. కాళీయుడిని జయించిన తర్వాత శ్రీ కృష్ణుడు తన వేణు గానం తో యమునా నీటిని శుద్ధి చేశాడట. వేణువు మాధుర్యంతో ప్రతికూలత కూడా సానుకూలంగా మారుతుందని దీని ద్వారా తెలుస్తుంది.

నెమలి ఈక, వేణువు కలయిక శ్రీకృష్ణుని తలపై ఉన్న నెమలి ఈక , అతని చేతిలో ఉన్న వేణువు ఆయన దివ్య రూపానికి గుర్తింపు. నెమలి ఈక స్వచ్ఛత ,అదృష్టానికి చిహ్నం అని నమ్ముతారు. ఈ నెమలి ఈక వేణువుతో కలిసి ఉన్నప్పుడు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..