- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: Learn These 4 Essential Life Skills from Dogs
Chanakya Niti: కుక్క నుంచి నేర్చుకోవాల్సిన 4 విలువైన జీవిత పాఠాలు ఇవే.. వీటిని పాటిస్తే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందన్న చాణక్య
పండితుడు, రాజకీయవేత్త, వ్యూహకర్త ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు మాత్రమే కాదు. తన అనుభవం, అధ్యయనం ద్వారా జీవితానికి సంబంధించిన సత్యాలను కూడా వెల్లడించాడు. చాణక్య నీతిలో వ్యక్తి పండితులు లేదా పుస్తకాల నుంచి మాత్రమే కాదు ప్రకృతిలో భాగమైన జంతువులు, పక్షుల నుంచి కూడా చాలా నేర్చుకోవాలని ఆయన చెప్పారు. ఈ రోజు చాణక్యుడు చెప్పిన మనిషి కుక్క నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Aug 13, 2025 | 9:31 AM

గొప్ప తత్వవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్య తన 'నీతి-సూత్రాల' ద్వారా మనిషికి జీవించే కళను నేర్పించారు. చాణక్య నీతిలో రాజకీయాలు, దౌత్య సూత్రాలు మాత్రమే కాకుండా రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఉన్నాయి. అవి మనిషి జీవితానికి సంబంధించిన సరైన మార్గాన్ని చూపుతాయి. మనిషి జీవితంలో విజయం సాధించాలంటే కుక్కల నుంచి 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలని ఆచార్య చాణక్య చెప్పాడు. చాణక్యుడు కుక్కల నుంచి నేర్చుకోవాలని చెప్పిన 4 విలువైన జీవిత పాఠాలు ఏమిటో తెలుసుకుందాం.

ఎల్లప్పుడూ సంతృప్తి చెందడం: చాణక్య నీతి ప్రకారం కుక్క తనకు ఏది దొరికినా దానితో సంతృప్తి చెందుతుంది. ఎండిన రొట్టె దొరికినా దానిని సంతోషంగా తింటుంది. ఈ గుణం మనిషి కూడా అలవర్చుకోవాలి. మనిషి జీవితంలో తనకు ఏది దొరికినా దానితో సంతృప్తి చెందాలని మనకు బోధిస్తుంది. ఎల్లప్పుడూ ఏదోకటి కావాలంటూ వాటి వెంట పరుగెత్తడం వల్ల మనస్సులో అశాంతి ఏర్పడుతుంది. కనుక మనిషి తన కృషి, నిజాయితీ ద్వారా సాధించిన విజయంతో సంతృప్తి చెందాలని చాణక్య చెప్పాడు.

గాఢ నిద్రలో ఉన్నా అప్రమత్తంగా ఉండటం: కుక్కల్లోని మరొక అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. అవి ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ.. చిన్న శబ్దం వచ్చిన వెంటనే మేల్కొంటాయి. ఈ గుణం మనిషి కూడా నేర్చుకోవాలని.. ఎటువంటి సమయంలోనైనా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని .. కుక్కలు బోధిస్తాయి. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ.. మన లక్ష్యాలు, బాధ్యతల గురించి మనం తెలుసుకోవాలి. జీవితంలో వచ్చే ప్రతి సవాలుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటమే విజయానికి కీలకం.

యజమాని పట్ల విధేయత: చాణక్య చెప్పినట్టు కుక్కలు తమ యజమానులకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. అవి తమ యజమానులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడతాయి. ఈ గుణం మన కుటుంబం, స్నేహితులు, సమాజం పట్ల మనం విశ్వాసపాత్రంగా ఉండాలని మనకు బోధిస్తుంది. మనకు మంచి చేసేవారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో, నిజాయితీగా ఉండాలి. విధేయత అనేది ఏదైనా సంబంధానికి పునాదిని బలపరిచే గుణం. అదే కుక్క నుంచి మనిషి నేర్చుకోవాల్సిన మరొక గుణం.

నిర్భయత: ఒక అపరిచితుడు కుక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడు.. అది ఎంత పెద్దవాడైనా సరే.. దానిని నిర్భయంగా ఎదుర్కొంటుంది. ఈ గుణం మన లక్ష్యాలను, సూత్రాలను కాపాడుకోవడానికి మనం నిర్భయంగా నిలబడాలని మనకు బోధిస్తుంది. జీవితంలో చాలాసార్లు, అన్యాయాన్ని వ్యతిరేకించవలసి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో మనం భయం లేకుండా సత్యానికి మద్దతు ఇవ్వాలి.

ఆచార్య చాణక్యుడి ఈ ఆలోచనల నుంచి మన చుట్టూ ఉన్న జంతువుల నుంచి మనం చాలా నేర్చుకోగలమని మనకు తెలుస్తుంది. కుక్కలకి చెందిన ఈ నాలుగు లక్షణాలు సంతృప్తి, అప్రమత్తత, విధేయత, నిర్భయత అనే వాటిని మనిషి జీవితంలో స్వీకరించినట్లయితే.. విజయానికి మార్గం సులభం అవుతుంది.




