AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ సంఖ్య వారికి ముక్కుమీదే కోపం ఉంటుంది? నియంత్రించుకునే మార్గం ఏమిటంటే..

సంఖ్యాశాస్త్రం దీనినే న్యూమరాలజీ అని అంటారు. ఇది మానవ జీవితం, వ్యక్తిత్వం, భవిష్యత్తును తెలియజేసే అధ్యయనం. ఇది పుట్టిన తేదీలు, పేర్లలోని అక్షరాలు వంటి వాటిలోని నిర్దిష్ట సంఖ్యల ఆధారంగా వ్యక్తుల గురించి అంచనాలు వేస్తుంది. వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం, మానసిక లక్షణాలకు ప్రతిబింబం. ప్రతి సంఖ్య ఒక గ్రహానికి సంబంధించినది. ప్రతి సంఖ్యకు సొంత లక్షణాలు, లోపాలు ఉంటాయి. వాటిలో కొన్ని సంఖ్యలు ఉన్న వ్యక్తులకు ముక్కు మీదే కోపం ఉంటుంది. వీరిని దుర్వాస ముని అంటూ ముద్దుగా పిలుస్తారు. మరి ఆ సంఖ్య ఏమిటో తెలుసుకుందాం..

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ సంఖ్య వారికి ముక్కుమీదే కోపం ఉంటుంది? నియంత్రించుకునే మార్గం ఏమిటంటే..
Numerology
Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 3:09 PM

Share

సంఖ్యాశాస్త్రం జనన సంఖ్య ప్రకారం వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, విభిన్న అంశాలు వెల్లడిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం అత్యంత కోపంగా పరిగణించబడే కొన్ని జనన సంఖ్యలు ఉన్నాయి. వీరికి కోపం రావడానికి పెద్దగా కారణాలు అవసరం ఉండదు. ముక్కు మీదే కోపం ఉంటుంది. మూల సంఖ్యల ఆధారంగా మన వ్యక్తిత్వం, భావోద్వేగాలు, ప్రవర్తన గురించి సంఖ్యాశాస్త్రం ఆసక్తికరమైన అంతర్దృష్టులను అందిస్తుంది. వీటిలో కొన్ని సంఖ్యలు అమితంగా కోపం కలిగి ఉంటాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ మూల సంఖ్య వారు అత్యంత కోపం కలిగి ఉంటారంటే..

మూల సంఖ్య 1 స్వభావం: నంబర్ 1 ఉన్న వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు, ఆత్మగౌరవం కలిగి ఉంటారు.

కోపం: వీరు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఎవరైనా తమ మాట వినకపోతే లేదా వారు తమ కోరికలను నెరవేర్చలేకపోతే అమితమైన కోపానికి గురవుతారు.

ఇవి కూడా చదవండి

కారణం: వీరు ఉద్రేక పరులు. ఆధిపత్య భావన వీరిని సులభంగా కోపానికి గురయ్యేలా చేస్తాయి. అయితే వీరి కోపం ఎక్కువ సమయం ఉండదు.

మూల సంఖ్య 4 స్వభావం : కష్టపడి పనిచేసే గుణం, క్రమశిక్షణ , స్థిరమైన స్వభావం వీరి సొంతం

కోపం: అయితే తమ విషయాల పట్ల నియంత్రణ కోల్పోయినప్పుడు లేదా నియమాలు ఉల్లంఘించినప్పుడు.. ఈ వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు.

కారణం: వీరికి సహనం తక్కువగా ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వీరికి వెంటనే కోపం వచ్చేస్తుంది.

మూల సంఖ్య 7 స్వభావం: మానసికంగా లోతైన ఆలోచన, రహస్యమైన, సున్నితమైన వ్యక్తులు.

కోపం: బాహ్య ప్రపంచానికి దూరంగా ఒంటరితనంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఈ ఒంటరితనం అనుభూతి కారణంగా కొన్నిసార్లు ఆకస్మిక కోపాన్ని ప్రదర్శించవచ్చు.

కారణం: వీరికి కోపం వెంటనే రాదు. లోలోపల అణచి ఉంచుతారు. కొన్నిసార్లు బయటపడుతుంది. అప్పుడు ఆ కోపం ఉగ్ర రూపంలో ఉంటుంది.

మూల సంఖ్య 9   స్వభావం: వీరు కరుణామయులు, భావోద్వేగపరులు, న్యాయవంతులు.

కోపం: వీర అన్యాయం లేదా ద్రోహం జరిగింది అని భావించినప్పుడు..వెంటనే కోపం వచ్చేస్తుంది.

కారణం: వీరికి కోపం సామాజిక అసమానత లేదా తప్పులు జరిగే వస్తుంది.

అత్యంత కోపం ఉన్న మూల సంఖ్య ఏదంటే సంఖ్యాశాస్త్రంలో నంబర్ 1 ఉన్న వ్యక్తులు అత్యంత కోపం ఉన్న వ్యక్తులు ఉద్వేగభరితులుగా పరిగణించబడతారు. వీరి కోపం తీవ్రంగా ఉంటుంది.. అయితే త్వరగా శాంతిస్తారు. నాయకత్వ స్వభావం ఉంటుంది తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి పోరాడుతారు.. కనుక కోపం వీరి వ్యక్తిత్వంలో ఒక భాగం.

కోపాన్ని నియంత్రించుకునే మార్గాలు (సంఖ్యాశాస్త్రం ప్రకారం)

నంబర్ 1: ధ్యానం, యోగా , ప్రాణాయామ పద్ధతులను అవలంబించండి.

సంఖ్య 4: ఓర్పును పెంచుకోవడానికి సమయ నిర్వహణ, సానుకూల ఆలోచన అవసరం.

సంఖ్య 7: వీరు ధ్యానం చేయాలి. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి.

సంఖ్య 9: వీరు తమ భావాలను వ్యక్తీకరించడానికి రచన లేదా కళ సహాయం తీసుకోవడం మంచిది

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'