AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuppintaku Herb: కుప్పింటాకుని కలుపుమొక్కగా భావిస్తున్నారా.. కీళ్ళ నొప్పులతో సహా ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం..

మనిషి శరీరానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి అనేక ఔషధ గుణాలున్న మొక్కలను ఇచ్చింది. అయితే మన చుట్టుపక్కల ఆవరణలో కనిపించే కొన్ని మొక్కలను పిచ్చిమొక్క , కలుపుమొక్క అంటూ పీకి పడేస్తాం. అయితే ఇలా పెరిగే మొక్కలలో అనేక ఔషధ గునలున్నాయని ఆయుర్వేదం చెబుతుంది. అలా మనం పిచ్చి మొక్క అని భావించే మొక్కలలో ఒకటి కుప్పింటాకు. దీనిని పలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని మీకు తెలుసా

Kuppintaku Herb: కుప్పింటాకుని కలుపుమొక్కగా భావిస్తున్నారా.. కీళ్ళ నొప్పులతో సహా ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం..
Kuppintaku Herb
Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 1:17 PM

Share

ప్రసుత్తం ఎటువంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే మెడిసిన్ తీసుకుంటాం.. అయితే ఈ రసాయన ఔషధలను విరివిగా ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయని.. కాలక్రమంలో శరీరంపై దుష్పభావాలను చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది సహజ సిద్ధ ఔషధాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలంటి వైద్యంలో ఆయుర్వేదం ఒకటి. ఈ వైద్యంలో ఉపయోగించే మందులు ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే మొక్కలు , వేర్లు, పువ్వులు, పండ్లు వంటి వాటితో తయారు చేస్తారు. అందుకనే ఆయుర్వేదంపై ఆధారపడడం మేలని వారు సూచిస్తున్నారు. అలాంటి ఆయుర్వేద మొక్కలో ఒకటి కుప్పింటాకు.

ఇది రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, చేల దగ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ కనిపిస్తుంది. అయితే అతి తక్కువ మందికి మాత్రమే ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.. అవి ఏమిటంటే..

  1. కుప్పింటాకు వేర్లను దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పిప్పి పళ్ళ నొప్పి తగ్గుతాయి. దంతాలు తెల్లగా మెరుస్తాయి. చిగుళ్లు గట్టి పడతాయి. చిగుళ్ళ నుంచి రక్తం స్రావం అవ్వదు.
  2. కుప్పింటాకు ఆకుల రసం తల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు, కడుపులో నులి పురుగు ఉన్నా.. ఈ కుప్పింటాకు రసాన్ని ముక్కులో వేసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది.
  5. జ్వరం, వాంతులు, కఫం వంటి వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు కుప్పింటాకు నీటిలో మరిగించి తాగితే తగ్గుతాయి.
  6. చర్మం దురద, దద్దులు వంటి సమస్యలకు, మొటిమలు, కురుపులు, అవాంఛిత రోమాలు తొలగించడంలో కుప్పింటాకు మంచి సహాయకారి. కుప్పింటాకు రసంలో ఉప్పు, పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని బాధిత ప్రదేశాల్లో అప్లై చేయడం వలన సమస్యలు నయం అవుతాయి.
  7. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దనా చేసుకుంటే.. తగ్గుతుంది. కుప్పింటాకు రసాన్ని బాధిత ప్రాంతంపై రాసినా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  8. కుప్పింటాకు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుప్పింటాకు టీ రోజూ తాగడం వలన హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
  9. చెవులు, గురక సమస్యలకు కుప్పింటాకు తైలాన్ని ఉపయోగిస్తారు. రాత్రి పడుకునే ఈ నూనెను ఉపయోగిస్తే గురక సమస్య క్రమంగా తగ్గుతుంది.

అయితే ఈ కుప్పింటాకుని, మందుల‌ను వాడేట‌ప్పుడు ఆయుర్వేద వైద్యుడి ప‌ర్య‌వేక్ష‌ణ ఉండ‌డం చాలా అవ‌స‌రం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)