AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragon Fruit Iced Tea: కళ్ళకి మాత్రమే కాదు శరీరానికి విందు.. డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ.. రెసిపీ ఏమిటంటే

బ్రిటిష్ మన దేశం నుంచి వెళ్ళిపోయినా వారు చేసిన టీ అలవాటుని భారతీయులు సొంతం చేసుకున్నారు. ఎంతగా అంటే.. తేనీరు కేవలం పానీయం మాత్రమే కాదు, వారసత్వ సంపదగా కూడా మారిపోయింది. ఇప్పుడు మన దేశంలో పాలతో తయారు చేసే టీని ఎక్కువ మంది తాగుతున్నా.. ఈ టీకి మసాలా జోడించి ఆరోగ్యకరంగా చేసుకున్నారు. అంతేకాదు గ్రీన్ టీ, చామంతి టీ, పచ్చిమిర్చి టీ, ఇలా రకరకాల టీలు దొరుకుతున్నాయి. అలాంటి టీలో ఒకటి డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ పింక్ టీ.. దీని రెసిపీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Dragon Fruit Iced Tea: కళ్ళకి మాత్రమే కాదు శరీరానికి విందు.. డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ.. రెసిపీ ఏమిటంటే
Pink Dragon Fruit Iced Tea
Surya Kala
|

Updated on: Aug 13, 2025 | 2:32 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న తేనీరు ప్రియుల దృష్టి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ ఆకర్షిస్తోంది. దీని రంగు రుచి కూడా అలరిస్తుంది. గ్రీన్ టీ , డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కలయికతో పింక్ టీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పింక్ రంగు టీ అందంగా కనిపించడమే కాదు ఆరోగ్యకరం కూడా.. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు, డ్రాగన్ ఫ్రూట్ లోని పోషకాలు ఈ టీని ఆరోగ్య పానీయంగా చేస్తున్నాయి. ఈ పింక్ టీ కళ్ళకు మాత్రమే కాదు శరీరానికి కూడా ఒక విందు. జీర్ణక్రియకు సహాయపడుతుంది. షుగర్ పేషెంట్స్ కి ప్రయోజనం చేకూరుస్తుంది. మిల్క్ టీ కంటే ఎన్నో రెట్లు ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఐస్‌డ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ రెసిపీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

తాజా డ్రాగన్‌ఫ్రూట్- ¼ కప్పు గుజ్జు

నీరు- ½ కప్పు

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ బ్యాగ్- 1

తాజా నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు

తాజాడ్రాగన్ ఫ్రూట్ ముక్కలు- 2 టేబుల్ స్పూన్లు

ఐస్ క్యూబ్స్- 6

తేనె – రుచికి సరిపడా

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు నీరు పోసుకుని నీటిని మరిగించి.. ఆ నీటిని ఒక కప్పులోకి తీసుకుని ఆ వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ లో వేయండి. ఈ గ్రీన్ టీ ఉన్న నీరుని గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచండి. తర్వాత నీటి నుంచి గ్రీన్ టీ బ్యాగ్‌ను తీసివేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ టీ నీటిలో డ్రాగన్‌ఫ్రూట్ ప్యూరీ వేసి బాగా కలపండి. లేదా బ్లెండ్ చేయండి. తర్వాత ఈ నీటిని వడకట్టి.. ఆ నీటిలో డ్రాగన్‌ఫ్రూట్ ముక్కలు, నిమ్మరసం వేసి కలపండి. నచ్చిన విధంగా స్వీటెనర్ అంటే తేనెను జోడించండి. చివరగా కావాల్సినన్ని ఐస్ క్యూబ్స్ జోదించండి. అంతే చల్లచల్లగా డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ రెడీ. అంతే ఈ టీని ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.