ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సైయారా OTT డేట్స్ ఫిక్స్
పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోన్న ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాగా వచ్చిన సైయారా అద్బుతాలు చేస్తోంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు. భారీగా బడ్జెట్ కూడా పెట్టలేదు. వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా ఏమీ లేవు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. అసలు రిలీజ్ కు ముందు సైయారా గురించే ఎవరికీ తెలీదు.
అలాంటి ఈసినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయి.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. కోట్లాది రూపాయలను కలెక్ట్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.. కురిపిస్తోనే ఉంది. ఇప్పుడు అదే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది. నేషనల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. జూలై 18న రిలీజైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. స్టిల్ హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబడుతోంది. ఇంకా యుతను థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది. కలెక్షన్స్‌లోనూ 500 కోట్ల మార్కును దాటేసిందంటూ మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్న వీడియో కూడా రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే అసలు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఎప్పుడు వస్తుందంటూ జనాలు ఆరా తీస్తున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఓ న్యూస్ బయటికి వచ్చిందిప్పుడు. సైయారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. సైయారా చిత్ర బృందంలో భాగమైన షానో శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబట్టి ఇదే అధికారిక రిలీజ్ డేట్ అయి ఉండొచ్చని టాక్. ఇక సైయారా చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. అనన్య పాండే బ్రదర్ అహాన్ పాండే హీరోగా డెబ్యూ ఇచ్చాడు. హీరోయిన్‌గా అనీత్ పద్దా నటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: ‘నా భర్త కౌంట్ 199 ‘ చరణ్ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన
జాలరి పంట పండిందిగా.. వలలో చిక్కింది చూసి షాక్
రైల్వే సరికొత్త ఆఫర్.. టికెట్ ధరలో రాయితీ
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

