AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

300 కోట్ల దిశగా.. మహావతార్‌ నరసింహ మూవీ

300 కోట్ల దిశగా.. మహావతార్‌ నరసింహ మూవీ

Phani CH
|

Updated on: Aug 14, 2025 | 1:24 PM

Share

మహావతార్ నరసింహ దేశంలోనే అతిపెద్ద యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. జులై 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోన్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను హిందువులు మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తున్నారు.

300 కోట్ల కలెక్షన్ల వైపు వేగంగా అడుగులు వేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ గురించి దర్శకుడు అశ్విన్ కుమార్ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక యానిమేటెడ్ సినిమా మొదటి వారంలోనే రూ. 100 కోట్లు వసూలు చేయడం నిజంగా ఆనందకరమైన విషయం. ఇంత భారీ వసూళ్లు వస్తాయని మేం ఊహించలేదన్నాడు డైరెక్టర్ అశ్విన్ కుమార్. మన దేశంలో వివిధ మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. బహుశా ఈ వైవిధ్యం వల్లే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఇంతగా తాకిందన్నారు ఆయన. భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా కనిపించే విభిన్నమైన, గొప్ప యానిమేషన్ అనుభవాన్ని తాము ప్రేక్షకులకు అందించామమన్నాడు అశ్విన్. భారతదేశంలో చాలా మంది యానిమేషన్ చిత్రాలు పిల్లల కోసం మాత్రమే అని అనుకునేవారని.. కానీ మా సినిమా ఈ ఆలోచనను మార్చేసిందన్నాడు ఈయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త షో స్టార్ట్ చేసిన జగపతి బాబు! రిబ్బన్ కట్‌ నాగార్జునతోనే…

విధి ఆడిన వింత నాటకంలో.. పాపం! చాలా కామెడీగా బలయ్యాడుగా..

ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సైయారా OTT డేట్స్‌ ఫిక్స్‌

Upasana Konidela: ‘నా భర్త కౌంట్ 199 ‘ చరణ్‌ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన

జాలరి పంట పండిందిగా.. వలలో చిక్కింది చూసి షాక్