ఎట్టకేలకు అసలు బడ్జెట్ ఎంతో బయటపెట్టిన మహావతార్ నరసింహ డైరెక్టర్
మహావతార్ నరసింహ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు.. ప్రమోషనల్ స్ట్రాటజీలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ.. జస్ట్ మౌత్ టాక్‌తోనే దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు కదిలించింది. వారిని థియేటర్లలోనే కదలకుండా కట్టిపడేసింది. భక్తి పారవశ్యంలో ముంచెత్తించింది. దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది.
అయితే ఈ సినిమా అసలు బడ్జెట్ ఎంతనే ప్రశ్న సోషల్ మీడియాలో ఈ మూవీ రిలీజ్ నుంచి వైరల్ అవుతోంది. కొంత మంది 15 కోట్లని .. మరి కొంత మంది 10 కోట్లని చెబుతూ పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ అసలు బడ్జెట్ ఎంతో రివీల్ చేశాడు ఈ మూవీ డైరెక్టర్ అశ్విన్ కుమార్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓ సినిమా గురించి మాట్లాడిన అశ్విన్ కుమార్.. ఈ సినిమా విజయం అనేక యానిమేటెడ్ చిత్రాలకు ద్వారాలు తెరిచిందంటూ చెప్పాడు. యానిమేషన్ ఒక శక్తివంతమైన మాధ్యమమని.. ఈ విషయాన్ని నిర్మాతలు, డైరెక్టర్లు అర్థం చేసుకుంటే మరిన్ని సినిమాలు వస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. హాలీవుడ్, చైనా, జపాన్, కొరియా చాలా సంవత్సరాలుగా ఇలాంటి సినిమాలను నిర్మిస్తున్నాయి. కానీ మన దేశంలో అరుదుగా మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తున్నాడు అశ్విన్. మహావతార్ నరసింహ కథకు యానిమేషన్ సరైన ఎంపిక. కొందరు ఈ సినిమాను రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని చెప్పారు. కానీ అసలు బడ్జెట్ 40 కోట్లు. ఇందులో మార్కెటింగ్ కూడా ఉంది అంటూ.. ఈసినిమాపై బడ్జెట్ పైఎట్టకేలకు నోరు విప్పాడు ఈ మూవీ డైరెక్టర్. అంతేకాదు మీకు సంకల్ప శక్తి ఉంటే, తక్కువ బడ్జెట్‌లో కూడా మరింత మంచి సినిమా తీయవచ్చు అంటూ తన మాటల్లో కోట్ చేశాడు ఈయన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్‌తో నటించేందుకు నో చెప్పిన.. మెగా హీరో
300 కోట్ల దిశగా.. మహావతార్ నరసింహ మూవీ
కొత్త షో స్టార్ట్ చేసిన జగపతి బాబు! రిబ్బన్ కట్ నాగార్జునతోనే…
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

