కూలీ రిలీజ్.. సెలవుతో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ
ఆగస్టు 14న విడుదలవుతున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా కూలీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోబిన్ , టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మోనికా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది మోనికా సాంగ్. కూలీ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే కూలీ సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని సంస్థలు స్వచ్చందంగా సెలవులు ప్రకటించాయి. ఇక తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన ఓ సంస్థ యజమాని కూలీ రిలీజ్ రోజున తమ సంస్థకు సెలవు ఇవ్వడంతో పాటు సినిమా టికెట్స్ కూడా ఇచ్చారు. యూనో ఆక్వా కేర్ అనే సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో పాటు ఉచితంగా సినిమా టికెట్లు అందించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయంలోని బ్రాంచ్‌ల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ సంస్థ ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాలు అందించడం అలాగే ప్రజలకు స్వీట్లు పంపిణీ చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఇతర సంస్థల ఉద్యోగులు కూడా తమకు కూడా కూలీ రిలీజ్ రోజున సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Coolie: కూలీ’ చిత్రానికి వారికి నో ఎంట్రీ
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు
వాటర్ ప్లీజ్..! కాళ్ల బేరానికొచ్చిన పాక్
ఎట్టకేలకు అసలు బడ్జెట్ ఎంతో బయటపెట్టిన మహావతార్ నరసింహ డైరెక్టర్
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

