చంద్రబాబు, పవన్‌కు NTR స్పెషల్ థాంక్స్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్ట్ 14న వార్2 , కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యాయి. కాగా, గత కొద్ది రోజులుగా ఈ మూవీ టిక్కెట్ రేట్ల విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమా టికెట్ల ధరలు చెన్నైలో ధరలు తక్కువగా ఉన్నాయని , హైదరాబాద్‌లో మాత్రం భారీగా పెంచారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో రూపొందిన వార్ 2, రజనీకాంత్ నటించిన కూలీ సినిమాల టికెట్ల ధరలను పెంచుకోవడానికి మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై హైప్ నెలకొని ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాకు స్పెషల్ షోలు, అధిక ధరలకి టికెట్ల విక్రయం కోసం అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రిలీజ్ రోజున ఉదయం 5 గంటలకు స్పెషల్ షో వేసుకోవచ్చని పేర్కొంది. ఈ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. వార్2 మూవీ టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ ఇవ్వడంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తారక్ ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉట్టి కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ.. జారి పడి బాలుడు మృతి
కూలీ రిలీజ్.. సెలవుతో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ
Coolie: కూలీ’ చిత్రానికి వారికి నో ఎంట్రీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

