ఉట్టి కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ.. జారి పడి బాలుడు మృతి
ఆగస్ట్ 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పెరుగు కుండను పగలగొడతారు. ఈ ఉత్సవాన్నే తెలుగు రాష్ట్రాల్లో ఉట్టి కొట్టడం అంటారు. శ్రీకృష్ణుడు పెరుగు, వెన్నలను దొంగిలించి తినేవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పెరుగు కుండను పగులగొట్టడం అనేది ఆచారంగా వస్తోంది. మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ‘దహీ హండీ’ పేరుతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
ఉట్టి కొట్టడం కొన్ని చోట్ల ఘనంగా జరుగుతుంది. శిక్షణ పొందిన బృందాలు మానవ పిరమిడ్‌గా ఏర్పడి ఉట్టి కొడతాయి. అందుకోసం కొన్ని రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారు. అలా ప్రాక్టీస్ చేసే క్రమంలోనే ముంబైలోని దహిసర్ ప్రాంతంలో మహేశ్ జాదవ్ అనే 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రాక్టీస్ చేస్తుండగా జారిపడ్డ జాదవ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ప్రాక్టీస్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూలీ రిలీజ్.. సెలవుతో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ
Coolie: కూలీ’ చిత్రానికి వారికి నో ఎంట్రీ
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులపాటు 10 రైళ్లు రద్దు
వాటర్ ప్లీజ్..! కాళ్ల బేరానికొచ్చిన పాక్
ఎట్టకేలకు అసలు బడ్జెట్ ఎంతో బయటపెట్టిన మహావతార్ నరసింహ డైరెక్టర్
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

