పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి ?? వివాదంలో జాన్వీ, సిద్ధార్థ్
మళ్లీ మంచి మంచి సినిమాలతో... హిట్స్‌తో బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అవుతున్న వేళ... పరమ్ సందరి మేకర్స్‌కు చిన్న ఝలక్ తగిలింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వారి ట్రైలర్ వివాదంలో చిక్కుకుంది. పవిత్ర స్థలంలో పాడు పడులేంటనే కామెంట్ కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరమ్ సుందరి.
ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేయనున్నాడు. తుషార్ జలోటా డైరెక్షన్ లో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే పరమ్ సుందరి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీని డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ చూపించారు. అయితే పరమ్ సుందరి సినిమా ఇప్పుడు ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఇందుకు కారణం ఆ సినిమా ట్రైలర్. ఇందులో చర్చిలో వచ్చే సన్నివేశాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పరమ్ సుందరి సినిమా సీన్లపై వాచ్‌డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సినిమా నుంచి చర్చి సీన్లను వెంటనే తొలగించాలని లేఖలో కోరింది. ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్పింది. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. మరి ఈ వివాదంపై ఈ మూవీ మేకర్స్ ఎలా రియాక్టవుతారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
170 కోట్లు ఏంటి సామి..! కలెక్షన్స్ సునామీ అంటే ఇదీ..
Samantha: అమ్మాయిలు అలర్ట్! తన స్కిన్ కేర్ సీక్రెట్ బయటపెట్టిన సామ్
‘కడుపు మంటతో.. నిజం చెప్పి..’ టీవీ షోలపై ఉదయభాను సంచలన కామెంట్స్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

