రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై అధిక ప్రభావం
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడతారు. ఇటీవల ఇలాంటి వారికోసం బ్యాంకులు ప్రత్యేకంగా హౌసింగ్ లోన్స్ ఇస్తూ వారి కలను సాకారం చేసుకోవడంలో అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్‌బీఐ నుంచి గృహ రుణాలు పొందినవారికి ఆ బ్యాంక్ ఊహించని షాకిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తే, దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాకిస్తూ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తే, దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాకిస్తూ.. కొత్తగా రుణాలు తీసుకునేవారికి వర్తించే వడ్డీ రేట్లను 25 శాతం బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్ల గరిష్ఠ పరిమితిని పెంచారు. ఇది ముఖ్యంగా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లపై అధికంగా పడనుంది. వారు ఇప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ప్రజలపై రుణ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఆర్‌బీఐ వరుసగా మూడుసార్లు రెపో రేటును 5.5 శాతానికి తగ్గించింది. సాధారణంగా రెపో రేటు తగ్గితే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) తో అనుసంధానమైన రుణాలు చౌకగా మారాలి. దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలలో దాదాపు 60 శాతం ఈబీఎల్ఆర్ ఆధారితమైనవే. రెపో రేటు తగ్గింపుతో రుణాలు చౌకగా మారతాయని గతంలో ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగమే ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.35% నుంచి 10.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడం రుణ గ్రహీతలకు ప్రయోజనకరమే అయినా, బ్యాంకుల లాభాల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని ఎస్‌బీఐ వర్గాలు అంతర్గతంగా హెచ్చరించాయి. ఈ ఒత్తిడే తాజా పెంపునకు కారణంగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!
ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అనూహ్య స్పందన..
EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్ న్యూస్..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

