AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!

రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!

Phani CH
|

Updated on: Aug 18, 2025 | 8:16 PM

Share

భవిష్యత్‌ అవసరాలకోసం అందరూ డబ్బు దాచుకోవాలనో.. ఎక్కడో అక్కడ పెట్టుబడి పెట్టాలనో భావిస్తారు. ఇలాంటివారికోసం ఎల్‌ఐసీ రకరకాల పాలసీలను అందుబాటులోకి తెస్తుంది. చిన్న, మధ్యతరగతివారు సైతం సులభంగా పెట్టుబడులు పెట్టేలా స్కీములు ఇందులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఈ పాలసీలో ఉంటుంది.

అదే జీవన్‌ ఆనంద్‌ పాలసీ. ఈ పాలసీ కేవలం బీమా రక్షణ మాత్రమే కాకుండా మీ భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో రోజుకు కేవలం 45 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. భవిష్యత్తులో 25 లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. మరి ఈ స్కీమ్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కువ మొత్తంలో డబ్బు జమ చేయాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తారు. కానీ జీవన్ ఆనంద్ పథకంలో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ పాలసీలో ప్రతి నెలా దాదాపు 13 వందల 58 రూపాయలు అంటే రోజుకు 45 రూపాయలు పొదుపు చేస్తే 35 ఏళ్ల కాలంలో మీరు 25 లక్షల రూపాయల మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం ద్వారా మీకు బీమా రక్షణతో పాటు, బోనస్‌ల రూపంలో అదనపు రాబడి కూడా ఉంటుంది. అదెలా అంటే.. మీరు 35 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 16 వేల 300 పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి 5 లక్షల 70 వేల 500 అవుతుంది. పాలసీ కాలం పూర్తయ్యాక, మీరు పెట్టిన పెట్టుబడికి అదనంగా బోనస్‌లు కలుపుకుని దాదాపు రూ. 25 లక్షల నిధిని అందుకుంటారు. ఈ మొత్తం బేసిక్ సమ్ అష్యూర్డ్ రూపంలో 5 లక్షలు, రివిజనరీ బోనస్ రూపంలో సుమారు 8 లక్షల 60 వేలు, తుది అదనపు బోనస్ కింద సుమారు 11 లక్షల 50 వేలు. ఈ మూడు మొత్తాలూ కలిపి మెచ్యూరిటీ సమయంలో మీకు సుమారు రూ. 25 లక్షలు లభిస్తాయి. ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏంటంటే..? ఇది డబుల్ బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎల్‌ఐసీ ప్రతి సంవత్సరం పాలసీదారుడికి రివిజనరీ బోనస్‌ ఇస్తుంది. దీంతో పాటు, పాలసీ కనీసం 15 సంవత్సరాలు పూర్తయితే, మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తంలో తుది అదనపు బోనస్‌ను కూడా జత చేస్తుంది. జీవన్ ఆనంద్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మెచ్యూరిటీ ప్రయోజనంతో పాటు బీమా కవరేజ్ కూడా పొందుతారు. దురదృష్టవశాత్తు పాలసీ కాలంలో పాలసీదారుడు మరణిస్తే, నామినీకి బీమా మొత్తంలో 125శాతం మరణ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా పాలసీకి ఆక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, టెర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ వంటి రైడర్లను కూడా జోడించుకునే అవకాశం ఉంది. ఇవి అదనపు భద్రతను కల్పిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాస్టాగ్ వార్షిక‌ పాస్‌కు అనూహ్య స్పందన..

EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్ న్యూస్..

హమ్మయ్య .. చిరుత బోనులో చిక్కింది.. ఎక్కడంటే..

చెప్పిన పనులు చేసే రోబో జస్ట్ రూ. 5 లక్షలే..

సమోసా ఇండియాలో పుట్టిందా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి..!