IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఆ డేట్‌ను ఫిక్స్ చేసి పెట్టుకోండి.. ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది!
ఆపిల్ యూజర్స్‌కు ఇది అదిరిపోయే శుభవార్త అనే చెప్పవచ్చు.. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐఫోన్ 17 సిరీస్ ను..ఆపిల్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజా లీక్స్ ప్రకారం.. ఈ సిరీస్ లాంచ్ సెప్టెంబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది. కాబట్టి కొత్తఫోన్ కొనాలనుకునే ఐఫోన్ లవర్స్ ఆ డేట్స్‌ను మీ క్యాలెండర్‌లో రౌండప్ చేసి పెట్టుకోండి.

మీరు కొత్త ఐఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మీ క్యాలెండర్‌లో ఈ తేదీలను టిక్ చేసి పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే.. తాగా లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తేదీని ఎప్పటిలాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా ఆపిల్ సెప్టెంబర్ నెల అంతా తన ఐఫోన్‌లు, వాచ్‌లు, ఇతర పరికరాలను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్, ఫోర్బ్స్ నివేదికల ప్రకారం ఆపిల్ సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఈవెంట్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఐఫోన్ 16 ప్లస్ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 17 ఎయిర్. మిగిలిన మోడళ్లలో కంపెనీ స్పెక్స్ అప్‌గ్రేడ్‌లను తీసుకువస్తుంది.
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ షెడ్యూల్
- సెప్టెంబర్ 9: ఐఫోన్ 17 సిరీస్, కొత్త ఆపిల్ వాచ్, ఇతర ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి
- సెప్టెంబర్ 12: ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభమవుతాయి
- సెప్టెంబర్ 19: ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అమ్మకాలు స్టార్ట్ అవుతాయి
ఐఫోన్ 17 ప్రో లాంచ్ డేట్, ధర వివరాలు..
- సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది.
- ఐఫోన్ 17 ప్రో కూడా బ్లాక్, యాష్, వైట్, ఆరెంజ్, బ్రైట్ బ్లూ వంటి 5 వేర్వేరు కలర్స్‌లో రానుంది.
- ధరల విషయానికొస్తే ఈ ఐఫోన్ 17 ప్రో రూ. 1,45,900 ప్రారంభ ధరకు లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: చెల్లింపు ఛార్జీలు లేకుండానే.. ఎలా ఈ కంపెనీలకు కోట్ల ఆధాయం వస్తుందో తెలుసా?
గమనిక: పైన తేదీలు గతంలో ఆపిల్ లాంచ్ తేదీలు, నివేదికల ఆధారంగా అందించబడినవి. కాబట్టి సెప్టెంబర్ 9న ఐఫోన్ మాత్రమే లాంచ్ అవుతుందా? లేదా ఆపిల్‌కు చెందిన ఇతర ఉత్పత్తులు కూడా ఈ సెప్టెంబర్ ఈవెంట్ లాంచ్ చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కాబట్టి వీటిపై మీకు ఎవైనా సందేహాలు ఉంటే.. లాంచ్ డేట్ వరకు ఆగాల్సిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




