AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెల్లింపు ఛార్జీలు లేకుండానే.. ఎలా ఈ కంపెనీలకు కోట్ల ఆధాయం వస్తుందో తెలుసా?

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. చేతితో డబ్బులు పెట్టుకోవడమే మర్చిపోయారు. దీంతో Google Pay, PhonePe వంటి UPI యాప్స్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే యూపీఐ చెల్లింపులపై ఈ యాప్స్‌ ఎటువంటి చార్జెస్‌ తీసుకోవు. అయినా ఆ సంస్థలకు లాభాలు ఎలా వస్తున్నాయి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ కంపెనీలు ఎలా డబ్బులు సంపాధిస్తాయి. వాటికి ఆదాయం ఎలా వస్తుంది, వాటి ప్రధాన ఆదాయ వనరుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకుందాం.

చెల్లింపు ఛార్జీలు లేకుండానే.. ఎలా ఈ కంపెనీలకు కోట్ల ఆధాయం వస్తుందో తెలుసా?
How G Pay And P Pe Benefit
Anand T
|

Updated on: Aug 16, 2025 | 9:21 PM

Share

నేటి డిజిటల్ యుగంలో, Google Pay, PhonePe వంటి యాప్‌లు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ₹1 నుండి లక్ష రూపాయల వరకు అన్ని లావాదేవీలు ఈ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. చాలా మంది పాకెట్‌లో డబ్బులు పెట్టుకోవడమే మానేశారు. ప్రతి ఒక్కరు ఈ యూపీఐ యాప్స్‌నే వాడేస్తున్నారు. అయితే ఈ యాప్స్‌ చెల్లింపులకు ఎలాంటి ఛార్జెస్‌, కమీషన్లు తీసుకోవు. అయినప్పటికీ ఈ కంపెనీలు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తాయి. ప్రతి ఒక్కరికీ ఈ డౌట్‌ ఉంటుంది. అయితే ఈ కంపెనీలు చాలా భిన్నమైన ఆదాయ వణరులను కలిగి ఉన్నాయట, ఇది నమ్మకం, అధిక వినియోగం, వినూత్న సేవలపై ఆధారపడి ఉంటుంది. వారి ప్రధాన ఆదాయ వనరులు చూసుకుంటే.. ఈ క్రింది విధంగా ఉన్నాయి

వాయిస్-ఆపరేటెడ్ స్పీకర్ సర్వీస్

మీరు కిరాణా దుకాణానికి లేదా చిన్న లేదా పెద్ద దుకాణానికి వెళ్ళినప్పుడు, “మీకు PhonePeలో రూ.100 వచ్చింది” అని చాలాసార్లు విని ఉంటారు కదా.. ఈ స్పీకర్లు ఈ కంపెనీలకు చెందినవి. ఈ కంపెనీలు ఈ స్పీకర్ సేవలను దుకాణదారులకు నెలకు రూ. 100కి అద్దెకు ఇస్తాయి. ఈ స్పీకర్లు దేశంలోని 30 లక్షలకు పైగా దుకాణాలలో ఉపయోగించబడుతున్నాయి. దీనివల్ల కంపెనీలకు నెలకు రూ. 30 కోట్లు, సంవత్సరానికి రూ.360 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.

స్క్రాచ్ కార్డ్స్‌, ప్రమోషన్లు

మనం ఏదైనా పేమెంట్‌ చేసినప్పుడు మనకు స్క్రాచ్ కార్డులు వస్తుంటాయి.. వాటిలో వివిధ కంపెనీల నుండి క్యాష్‌బ్యాక్ లేదా కూపన్లు ఉంటాయి. కంపెనీలు ఈ కూపన్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తాయి. కానీ, దీని వెనుక ఒక బిజినెస్ స్టార్టజీ ఉంది. వివిధ బ్రాండ్లు ఈ కంపెనీలకు తమ ప్రకటనల కోసం డబ్బులు చెల్లిస్తాయి. Google Pay, PhonePe వంటి బ్రాండ్లు తమ ప్రకటనల ద్వారా మిలియన్ల మంది కస్టమర్‌లను చేరుకోవడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. కాబట్టి, ఇది కంపెనీలకు రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్ సేవలు, రుణ సేవలు

ఈ కంపెనీలు UPIని కేవలం చెల్లింపు సాధనంగా కాకుండా, చిన్న వ్యాపారాలకు పూర్తి పరిష్కారంగా మార్చాయి. భవిష్యత్తులో, ఈ కంపెనీలు సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS), చిన్న దుకాణదారులకు రుణాలు ఇవ్వడం వంటి సేవలను ప్రారంభిస్తాయి. ఇది వారికి భారీ లాభాలను ఆర్జించే అవకాశం తెచ్చిపెడుతుంది. ఇలాంటి వనరుల ద్వారా, Google Pay, PhonePe వంటి కంపెనీలు ఎటువంటి లావాదేవీ రుసుము వసూలు చేయకుండా భారీ ఆదాయాన్ని సంపాదిస్తాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.