Gold Price Fall: మరింత తగ్గిన బంగారం ధర.. భారీ పతనం.. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. ముఖ్యంగా ఆడవాళ్లకు పుత్తడి మీదున్న మక్కువ చాలా ఎక్కువ. ఆడ, మగ అనే కాదు.. బంగారం ధరించేందుకు అందరూ ఇష్టపడతారు. ఒంటి నిండా నగలు వేసుకోవాలని ఆశపడుతుంటారు. కానీ, ఇటీవలి కాలంలో గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్ ఒడిదుడుకులు, బంగారంపై ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు పసిడి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటాయి. గత కొంతకాలంగా బంగారం ధరల్లో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన గోల్డ్ రేట్స్ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధర ఎలా ఉందంటే.

హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
భారతదేశం – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.1,00,960లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 92,540లుగా ఉంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,330లుగా ఉంది. అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.92,900 లుగా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,180, 22 క్యారెట్ల ధర రూ.92,750 ఉంది.
– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,01,180 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,750 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,01,180, 22 క్యారెట్ల ధర రూ.92,750 గా ఉంది.
– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,01,180 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,750 లుగా ఉంది.
– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,01,180, 22 క్యారెట్ల ధర రూ.92,750 లుగా ఉంది.
ఇక, ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే.. మనదేశంలో వెండి గ్రాము ధర రూ.126.20 ఉండగా, కిలో వెండి ధర రూ. 1,26,200లుగా ఉంది.
గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








