లిఫ్ట్ వదిలేసి మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..!
మెట్లు ఎక్కడం ఒక సాధారణ వ్యాయామం. ఇది మీ రోజు వారీ కార్యకలాపంలా అనిపించవచ్చు. కానీ, దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. అధిక బరువు సమస్యను తగ్గించడంలో మెట్లు ఎక్కడం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ సింపుల్ వ్యాయామంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Aug 16, 2025 | 9:47 PM

వ్యాయామం చేయడానికి సమయం లేనివారు లేదా జిమ్ సదుపాయం లేని వారికి ఇలా మెట్లు ఎక్కడం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు కూడా ఎక్కువగా మెట్లు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

మెట్లు ఎక్కడం కాలు కండరాలను బలోపేతం చేసే వ్యాయామం. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కితే కాలు కండరాలు బలంగా మారుతాయి. ప్రతిరోజు మెట్లు ఎక్కితే రక్తపోటు తగ్గి.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెట్లు ఎక్కితే ఎముకల ఆరోగ్యం బలపడుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మెట్లు ఎక్కడం అనేది శరీరంలో కొవ్వును బర్న్ చేయడానికి సహాయపడే మంచి వ్యాయామం. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. మెట్లు ఎక్కడం ఓర్పును పెంచే ఒక ఏరోబిక్ వ్యాయామం. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కితే ఓర్పు పెరుగుతుంది.

మెట్లు ఎక్కడం వల్ల కేలరీలను కరిగించి బరువు తగేలా చేస్తుందని ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది కండరాలను దృఢంగా చేయడానికి సాయపడుతుంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కీలక కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వాకింగ్ లాంటి యాక్టివిటీలతో పోలిస్తే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు కరిగినట్లు పరిశోధకులు వివరించారు. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి సుమారుగా 8నుంచి 11 కేలరీలు కరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వారంలో ఐదురోజుల పాటు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.




