AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Planning: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? ఆర్థికంగా బలంగా ఉన్నట్లే..!

Financial Planning: ప్రతి ఒక్కరు పెట్టుబడులను అనేవి అలవాటు చేసుకోవాలని. డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి రాబడి పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టేముందు ఎక్కడ పెట్టాలి? ఏన్నేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి..

Financial Planning: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? ఆర్థికంగా బలంగా ఉన్నట్లే..!
Subhash Goud
|

Updated on: Aug 17, 2025 | 10:48 AM

Share

Financial Planning: ప్రస్తుతం కాలంలో యువత డబ్బు ఖర్చు చేయడంలో ఒక ప్రణాళిక అంటూ ఏమి ఉండదు. ఇలాంటి ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ లేక ఎంతో మంది యువత అప్పుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డుల వాడకం, ఈఎంఐలతో సతమతమవుతున్నారు. చివరకు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణ కాలంలో అప్పుల భారాన్ని పెంచేస్తోందని ఫైనాన్షియల్ నిపుణులు అక్షత్ శ్రీవాస్తవ్ చెబుతున్నారు. ఓ వ్యక్తి ఫైనాన్షియల్‌గా ప్లానింగ్‌ చేస్తున్నాడంటే అతనికి ఉండే అలవాట్లే కారణమంటున్నారు. మరి ఎలాంటి అలవాట్లు ఉంటే ఆర్థికంగా బలంగా ఉంటాడో ఆయన వివరిస్తున్నారు.

మొత్తం సంపాదనలో 20 శాతం పొదుపు:

సంపాదిస్తున్న మెుత్తంలో 20 శాతం ప్రతి నెల క్రమశిక్షణతో పొదుపు చేయడం ముఖ్యమని శ్రీవాస్తవ్‌ చెబుతున్నారు. సంపన్నుల్లో కూడా దాదాపు సగం మంది మాత్రమే సేవింగ్స్ విషయంలో ప్లానింగ్‌తో ముందుకెళ్తారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మార్కెట్లో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల ధరలు పెరిగిపోతుండటంతో సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో వెనుకబడిపోతున్నారని శ్రీవాస్తవ్ అన్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక ప్రణాళికను నెరవేర్చుకోడం ద్వారా సొంతింటిని కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఇది భవిష్యత్తులో పెరిగే లివింగ్ ఖర్చులు ప్రధానంగా హెల్త్, ఫుడ్ వంటి వాటి నుంచి కొంద ఊరటను కలిగిస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Sundar Pichai Salary: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!

అప్పుల భారం తగ్గించుకోవాలి:

ఈ రోజుల్లో సంపాదనకంటే అప్పులు పెరిగిపోతున్నాయి. వచ్చే ఆదాయం తక్కువగా ఉంటే అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. యువత ఈఎంఐల భారం, దుబారా ఖర్చుల భారం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మెుత్తం సంపాదనలో ఈఎంఐలు 30 శాతం మాత్రమే ఉండాలని అప్పుడే ఆర్థికంగా బలంగా ఉన్నట్లు అని ఆయన సూచిస్తున్నారు.

ఎమర్జెన్సీ సేవింగ్‌:

ఇక ప్రతి ఒక్కరి వద్ద ఎమర్జీన్సీ సేవింగ్‌ అనేది ఉండాలని శ్రీవాస్తవ్‌ సూచిస్తున్నారు. ప్రస్తుతం మీకు నెలకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా కనీసం రెండేళ్ల పాటు జీవించటానికి సరిపడా డబ్బును ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అనుకోకుండా ఉద్యోగం పోయినా లేదా కొత్త కెరీర్ వైపు మారాలనుకున్నా అలాంటి సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండవచ్చని, ఎమర్జెన్సీ నిధులతో కుటుంబాన్ని నడిపించడంలోస హాయపడుతుందన్నారు.

పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి:

ప్రతి ఒక్కరు పెట్టుబడులను అనేవి అలవాటు చేసుకోవాలని. డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి రాబడి పొందవచ్చంటున్నారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టేముందు ఎక్కడ పెట్టాలి? ఏన్నేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు వస్తాయి? అనే విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యమంటున్నారు. తెలియకుంటే మంచి పెట్టుబడి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. సరైన అనుభవం లేకుంటే పెట్టుబడులు పెడితే చివరకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు దానిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే ఆ సంపద హరించుకుపోయే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ నిపుణులు అక్షత్ శ్రీవాస్తవ్ సూచిస్తున్నారు.

BSNL: 1 రూపాయికే రోజు 2GB డేటా.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. అదిరిపోయే ఆఫర్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి