AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఉదయమే ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు

కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ ను నివారిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మీరు ఉదయమే ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు
Lemongrass Tea
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2025 | 9:11 PM

Share

లెమన్ గ్రాస్ ఒక సూపర్ హెర్బ్. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఉదయమే టీ గా తీసుకోవటం వల్ల మీరు మీ శరీరంలో ఊహించని మార్పులను గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ హెర్బల్‌ డ్రింక్‌ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ టీ ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ప్రేగు కదలిక సాఫీగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ ను నివారిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

లెమన్ గ్రాస్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. లెమన్ గ్రాస్ టీ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం:

ఇందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని వేడి చేయండి. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఆకులు వేసి కాసేపు మరగనివ్వాలి. టీ రెడీ అయ్యాక వడకట్టాలి. రుచి కోసం కొంత తేనెను యాడ్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..