ఉదయాన్నే నిద్ర లేస్తే ఏమవుతుందో తెలుసా..? టాపర్లు, బిలియనీర్ల సీక్రెట్ ఇదేనండోయ్..
పొద్దున్న లేవాలంటే ముందు రోజు రాత్రి తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి త్వరగా నిద్రపోతే ఉదయం కూడా త్వరగా లేవడానికి అవుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు మొబైల్ ఫోన్, లాప్టాప్ ని పక్కన పెట్టేయడం వల్ల నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయాన్నే నిద్రలేస్తే ఫోకస్పెంచుకోవడం నుంచి రోజును ప్రొడక్టివ్‌గా గడపడం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేస్తే రోజులో కాస్త ఎక్కువ సమయం ఉంటుంది. మీరు మీ రోజును బాగా ప్లాన్చేసుకోవచ్చు. కొంతసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. పొద్దున్నే లేచే వారు ఆర్గనైజ్డ్గా ఉంటారని, ఫోకస్డ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవటం వల్ల మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు మీ భావోద్వేగాలను బాగా నియంత్రించవచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్నే నిద్ర లేవడం వల్ల వ్యాయామాలు చేసేందుకు సమయం ఉంటుంది. పొద్దున్నే లేచి చదువుకుంటే ఫోకస్ ఎక్కువగా ఉంటుందని, బాగా గుర్తుపెట్టుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇక మెదడు సరిగా ఆలోచించలేకపోతే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో మేల్కుంటే.. మీ మెదడు సృజనాత్మకంగా చేస్తుంది. మీ మనస్సు పరధ్యానం లేకుండా విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతుంది. పొద్దున్న లేవాలంటే ముందు రోజు రాత్రి తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి త్వరగా నిద్రపోతే ఉదయం కూడా త్వరగా లేవడానికి అవుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు మొబైల్ ఫోన్, లాప్టాప్ ని పక్కన పెట్టేయడం వల్ల నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








