AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెబితే నమ్మరుగానీ.. చామదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

అలాంటి దుంప కూరగాయల్లో ఒకటైన చామదుంప లో కూడా పిండి పదార్థం అధికంగానే వుంటుంది. కానీ, చామదుంపలతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి. రూట్ వెజిటబుల్‌ అయిన చామదుంపలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల మధుమేహులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

చెబితే నమ్మరుగానీ.. చామదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!
Chamadumpalu
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2025 | 6:42 PM

Share

సాధారణంగా చాలా మంది దుంపలు అనగానే దానిలో పిండి పదార్థాలు ఎక్కువగా వుంటాయని అపోహపడుతుంటారు. అదే భయంతో వాటిని తినాలంటే భయపడుతుంటారు. అలాంటి దుంప కూరగాయల్లో ఒకటైన చామదుంప లో కూడా పిండి పదార్థం అధికంగానే వుంటుంది. కానీ, చామదుంపలతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి. రూట్ వెజిటబుల్‌ అయిన చామదుంపలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల మధుమేహులకు చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

చామదుంపలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల ఇన్సులిన్ విడుదల నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. చామదుంపలు ఎనిమియా సమస్యతో బాధ పడే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రక్తం స్థాయిలో పెరుగుతాయి. చామ దుంపలో పోటాషియం అధికంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి లాభం చేకూరుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతాయి. అంతేకాదు చేమదుంపల్లో విటమిన్‌ బి-6, ‘ఇ’ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు చామ దుంపలు చాలా మంచిది. చామ దుంపలు తినడం వలన మహిళలోని ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఋతుసంబంధిత క్రాంప్స్‌, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల అలసట తగ్గించడానికి సహకరిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లు చామ దుంపలని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ ని మెరుగు చేస్తుంది. దీని మూలంగా శరీరం లో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. చామదుంప మూలాల్లో డయోస్జెనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేయడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే