జామ పండు తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా?
జామపండు అందరికీ తెలిసినవే, చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇక ఇవి తెలుపు రంగు, ఎరుపు రంగు రెండు రంగులలో మార్కెట్‌లో లభిస్తాయి. ఇక జామ పండ్లు పండుగా మారిన తర్వాత పసుు రంగుతో, చాలా మంచి సువాసనతో మంచి రుచిని ఇస్తాయి. అయితే ఇవి రుచిని ఇవ్వడమే కాకుండా, దీనిని ప్రతి రోజూ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, ఇప్పుడు జామ పండ్లు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో చూద్దాం.
Updated on: Aug 16, 2025 | 6:38 PM

జామ గింజలను సరిగ్గా నమలకుండా తింటే, అవి జీర్ణం కావడం కష్టమవుతుంది. దీంతో మలబద్ధకం సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు జామ పండ్లు పరిమితంగా తీసుకోవడం మంచిది. విత్తనాలను తొలగించకుండా వీరు అస్సలు తినకూడదు.

ఇక జామ పండ్లు రుచికి చాలా తియ్యగా ఉంటాయి. కానీ ఇవి శరీరంలో చక్కెర స్థాయిలను మాత్రం పెంచవంట. ఎందుకంటే ? జామ పండులో గ్లైసెమిక్ చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఇది రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించి, డయాబెటీస్ రోగులకు దానిని నంచి ఉపశమనం కలిగిస్తుందంట. అందుకే చక్కెర వ్యాధితో బాధ పడేవారు ప్రతి రోజూ ఒక జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

జామతో అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి. జామపండు కొద్దిగా ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని అధికంగా తీసుకుంటే అసిడిటీ పెరుగుతుంది. అందుకే గుండెల్లో మంటతో బాధపడేవారు జామపండు తినకూడదు.

జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 12 శాతంఫైబర్ జామ పండులోనే దొరుకుతుంది. అందువలన జీర్ణ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఒక జామ పండు తినడం వలన ఇది మలబద్ధకాన్ని తగ్గించి, పేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడమే కాకుండా హానికర బ్యాక్టీరియాలను తగ్గిస్తుందంట. అలాగే, కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంట.

జామపండు గుండెకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, ఫైబర్,యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరంలోని సోడియంను సమతుల్యం చేసి, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, భోజనానికి ముందు పండిన జామపండు తిన్న వ్యక్తులు 12 వారాలలో వారి రక్తపోటు , కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుచుకున్నట్లు వెళ్లడైనదంట.



