- Telugu News Photo Gallery Spiritual photos Health Astrology 2025 These zodiac signs to get good health details in telugu
Health Astrology: ఈ రాశుల వారికి అనారోగ్యాల నుంచి పూర్తిగా విముక్తి! ఇందులో మీ రాశీ ఉందా?
జీవితంలో చిన్నపాటి సమస్యలు, అనారోగ్యాలు సహజం. అవి లేని జీవితం ఉండదు. అయితే, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ప్రాణాంతక అనారోగ్యాలు, నయం కాని వ్యాధుల గురించి మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. జీవితం మీద వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో వీటిని కర్మరోగాలుగా అభివర్ణించడం జరిగింది. ఆరవ స్థానాన్ని బట్టి అనారోగ్య సమస్యలను, 11వ స్థానాన్ని బట్టి అనారోగ్యాల నుంచి కోలుకోవడాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులవారు అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Updated on: Aug 16, 2025 | 6:33 PM

మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల మరో ఏడాదిన్నర పాటు అనారోగ్యాలు లేని జీవితం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా రాహువు లాభ స్థానంలో ఉన్నప్పుడు వ్యాధులు, అనారోగ్యాలు దరిచేరవు. అనారోగ్యాలు పట్టుకున్నా రాహువు లాభ స్థాన ప్రవేశంతో వాటి నుంచి విముక్తి లభిస్తుంది. సాధారణంగా మేష రాశివారిని తలకు సంబంధించిన వ్యాధులు, రక్త సంబంధ మైన వ్యాధులు పీడించే అవకాశం ఉంది. వాటి నుంచి ఈ ఏడాది చివరి లోగా విముక్తి లభిస్తుంది.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సాధారణంగా లాభ స్థానంలో శని ఉన్నప్పుడు అనారోగ్యాలు కలిగే అవకాశం ఉండదు. అనారోగ్యాలు ఏవైనా ఉన్న పక్షంలో సంప్రదాయ వైద్య విధానాల ద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా థైరాయిడ్, స్థూలకాయం, స్పాండిలైటిస్ వంటి వ్యాధులతో బాధపడడం జరుగుతుంది. శని స్థితి వల్ల వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశివారికి ఒక పట్టాన అనారోగ్యాలు కలగవు. అనారోగ్యాలు కలిగితే మాత్రం ఒక పట్టాన వదలవు. ప్రస్తుతం లాభ స్థానంలో గురువు సంచారం వల్ల వీరిని అనారోగ్యాలు బాధించే అవకాశం తక్కువగా ఉంటుంది. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారికి తప్పకుండా సరైన చికిత్స లభిస్తుంది. ఈ రాశివారికి ఎక్కువగా హృద్రోగాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, మధుమేహం, బీపీల వంటివి పీడిస్తాయి. మరో ఏడాది పాటు వీరిని అనారోగ్యాలు పీడించే అవకాశం లేదు.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు అనా రోగ్యాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. సంప్రదాయ వైద్య విధానాల ద్వారా, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా వీరికి అనారోగ్యాల బాధ తగ్గుతుంది. ఈ రాశివారు నరాల సంబంధ మైన వ్యాధులు, కాలేయ వ్యాధులు, కీళ్ల వాపులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాటు బుధుడి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి సరైన చికిత్స లభిస్తుంది.

తుల: ఈ రాశికి లాభస్థానంలో రవి, కేతువుల సంచారం వల్ల ప్రస్తుతానికి దీర్ఘకాలిక అనారోగ్యాల సమ స్యలు ఉండకపోవచ్చు. లాభ స్థానంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు కొత్తగా అనారోగ్యాలు కలిగే అవకాశం ఉండదు. ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా వీరు తప్పకుండా అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. వీరిని గుండె, ఊపిరితిత్తులు, శ్వాసకోశం, పొత్తి కడుపు సమస్యలు ఎక్కువగా పీడించే అవకాశం ఉంది. రవి అనుకూలత వల్ల వీరు వీటి నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. వీరి అనారోగ్యాలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఈ రాశివారు సాధారణంగా పొత్తి కడుపు, పాంక్రియాస్, మధుమేహం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో అవస్థలు పడే అవకాశం ఉంది. కుజుడి అనుకూల సంచారం వల్ల వీరు తక్కువ కాలంలోనే కోలుకునే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది.



