AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ కేర్‌ఫుల్: శరీరంలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటే, అది శరీరంలో కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది. అవి మీ ఆరోగ్యం పట్ల హెచ్చరిక సంకేతాలు అంటున్నారు వైద్యులు. అలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాలని, వైద్యులను సంప్రదించి సరైన మందులు, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి సంకేతాలేంటో ఇక్కడ చూద్దాం...

బీ కేర్‌ఫుల్: శరీరంలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..
Diabetes Symptoms
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2025 | 4:48 PM

Share

డయాబెటిస్‌.. దీనినే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. ఈ డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు మధుమేహం బారిన పడుతుంటారు. డయాబెటిస్‌ని నిర్లక్ష్యం చేశారంటే..క్రమంగా శరీరాన్ని లోపలి నుండి దెబ్బతీయటం మొదలుపెడుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, కంటి చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటే, అది శరీరంలో కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది. అవి మీ ఆరోగ్యం పట్ల హెచ్చరిక సంకేతాలు అంటున్నారు వైద్యులు. అలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాలని, వైద్యులను సంప్రదించి సరైన మందులు, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి సంకేతాలేంటో ఇక్కడ చూద్దాం…

ఇవి 8 హెచ్చరిక సంకేతాలు:

1. అస్పష్టమైన దృష్టి- ఎవరైనా అకస్మాత్తుగా చూడటంలో సమస్యలను ఎదుర్కొంటే లేదా వస్తువులను రెండు రెట్లు చూస్తున్నట్లయితే ఇది మధుమేహానికి హెచ్చరిక సంకేతం.

2. చిగుళ్ళ నుండి రక్తస్రావం – ఇది దంత సమస్యల లక్షణం అయినప్పటికీ, కొన్నిసార్లు శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల చిగుళ్ళ నుండి రక్తస్రావం కూడా జరుగుతుంది.

3. తరచుగా మూత్ర విసర్జన – ఎవరైనా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే ముఖ్యంగా రాత్రి సమయంలో పదే పదే మూత్రానికి వెళ్తున్నారంటే ఇది కూడా మధుమేహానికి సంకేతం.

4. తలనొప్పి- ఎవరికైనా ప్రతిరోజూ తలనొప్పి, శరీరం పై భాగంలో భారంగా అనిపిస్తే ఇది కూడా చక్కెర పెరుగుదల లక్షణం.

5. చాలా దాహం వేయడం – అయితే, తరచుగా మూత్ర విసర్జన చేసే వ్యక్తి నిర్జలీకరణానికి గురవుతాడు. ఆ లోపాన్ని తీర్చడానికి వారికి తరచుగా దాహం వేస్తుంది. అలా ఎక్కువ నీరు తాగాల్సి వస్తుంది. కానీ ఇప్పటికీ హైడ్రేటెడ్ గా ఉండలేకపోతున్నాడు.

6. UTI- ఎవరికైనా వారి మూత్ర ప్రాంతాలలో పదేపదే ఇన్ఫెక్షన్లు వస్తుంటే, ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని సూచిస్తుంది.

7. పాదాలలో జలదరింపు: రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు పాదాలలో జలదరింపు అనుభూతి, చీమ కుట్టినట్లుగా గుచ్చుకునే అనుభూతి ఉంటుంది.

8. అలసిపోయిన శరీరం – సాధారణ దినచర్యను అనుసరిస్తున్నప్పటికీ అనవసరంగా అలసిపోయినట్లు అనిపించడం కూడా మీకు డయాబెటిస్ ఉందని లేదా ఉండవచ్చని సూచిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..