జిమ్‌కు వెళ్తూ.. ప్రోటీన్ తీసుకుంటున్నారా?.. ఇది కచ్చితంగా తెలుసుకోండి!.. లేదంటే మీకే నష్టం!
ప్రజెంట్ డేస్‌లో జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరు త్వరగా కండరాల పెరుగుదల కోసం ప్రోటీన్ పౌడర్‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది ప్రోటీన్ పౌడర్ నాణ్యతను చూడకుండా.. ఇన్‌స్టాగ్రామ్ ,యూట్యూబ్‌లో యాడ్స్ చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని నాణ్యతా రహితంగా ఉండి వాటి వల్ల మీరు ప్రయోజనం పొందలేరు. అంతేకాకుండా కొందరు ప్రోటిన్ ఎలా పడితే అలా తీసుకొంటుంటారు. అందుకే ప్రోటీన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Aug 16, 2025 | 6:51 PM

సరైన సమాచారం లేకుండా ఏ రకమైన ప్రోటీన్ పౌడర్ తీసుకోవద్దు. మీ శరీర రకం, లక్ష్యాలను అర్థం చేసుకున్న తర్వాత ప్రోటీన్ పౌడర్‌ను ఎంచుకోండి.

మార్కెట్‌లో చాలా రకాల ప్రోటిన్ పౌడర్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కల్తీ వాటని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ మధ్య చాలా కంపెనీలు ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను వాడి తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తాయి. కాబట్టి, ప్రోటిన్ కొనేప్పుడు ఎల్లప్పుడూ రివ్యూస్ చూసి, అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే కొనాలి.

మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. పాలు, పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, సోయా, జున్ను, డ్రై ఫ్రూట్స్ మంచి వనరులు. లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

జిమ్‌కు వెళ్లేముందు ప్రోటిన్‌ను పాలతో మాత్రం అస్సలు తీసుకోకండి.. ఇలా చేస్తే మన జీర్ణక్రియ దెబ్బతినవచ్చు. కాబట్టి మీరు వ్యాయామానికి ముందు లేదా తర్వాత ప్రోటీన్ తీసుకోవాలనుకుంటే, దానిని నీటితో తీసుకోండి, తద్వారా అది త్వరగా జీర్ణమవుతుంది. కండరాలు ప్రయోజనం పొందుతాయి.

ఒక రోజులో అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకోవడం కూడా మంచింది కాదు. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. శరీరానికి కిలోగ్రాము బరువుకు 1 గ్రాము చొప్పున ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు, 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అవసరం అవుతుంది. మీరు వ్యాయామం చేస్తే ఈ మొత్తం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, అయినప్పటికీ మీరు రోజుకు 1-2 స్కూప్‌ల కంటే ఎక్కువ ప్రోటీన్‌ను తీసుకోకూడదు.

ఇంకోటి మీకు ప్రోటీన్ పౌడర్ తీసుకునే అలవాటు ఉంటే నీరు బాగా తాగండి. ప్రోటీన్ సరిగ్గా జీర్ణం కావడానికి శరీరంలో నీటి కొరత ఉండకూడదు. తక్కువ నీరు త్రాగడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ బాగా జరగాలన్నా, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి ప్రోటీన్ పౌడర్‌తో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ( గమనిక పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంట్‌నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందిచబడినవి. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)




