Sun Breaks Off: అంతరిక్షంలో అనూహ్య ఘటన.. విరిగి వేరుపడిపోయిన సూర్యుడిలో కొంత భాగం.. తీవ్రమైన ఉష్ణతాపం..
ఆకాశంలో ఏం జరుగుతోంది? సూర్యుడి విరిగిపోతున్నాడా? ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యుడిలో ఒక ముక్క విరిగి వేరు పడిపోవడం దేనికి సంకేతం? సూర్యుడిలో ఏం జరుగుతోంది? ప్రపంచానికి ఏమైనా ముప్పు రాబోతోందా? భూగ్రహం సురక్షితంగా ఉంటుందా?
ప్రపంచానికంతటికి వెలుగులు పంచే సూర్యుడు ఖగోళశాస్త్రవేత్తలకు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాడు. కాని తాజాగా సూర్యుడిలో చోటుచేసుకున్న పరిణామాలు వారిని ఉలిక్కిపడేలా చేశాయి. సూర్యుడి నుంచి ఒక పెద్ద భాగం విరిగిపడిపోయింది. ఇలా జరగడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. దీని వల్ల ఉత్తరార్థ గోళంపై ఒక భారీ సుడిగుండం ఏర్పడినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సూర్యుడిలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తించింది. వెదర్ ఉమెన్‌గా పేరుగాంచిన డాక్టర్ తమితా స్కోప్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విరిగి వేరుపడిన ఆ ముక్క చుట్టు తిరిగి రావడానికి దాదాపు 8 గంటలు పట్టిందని ఆమె వివరించారు. అంతే కాదు ఈ పరిణామం చోటుచేసుకునే సమయంలో దాని వేగం సెకనుగు 96 కిలోమీటర్లుగా ఉందని నిర్థారించారు.
సౌర జ్వాలలు సూర్యుడి నుంచి వెలువడుతూ ఉంటాయి. ఈ జ్వాలలు కొన్నిసార్లు భూగ్రహంపై ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో తాజా పరిణామాన్ని చూస్తూ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సూర్యుడి నుంచి ఒక పెద్ద భాగం విడిపోవడం, అది సుడిగుండాన్ని సృష్టించడం, అది సృష్టించే పరిణామాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వాటిని అధ్యయనం చేస్తేగాని ఒక స్పష్టత రాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి గడిచిన కొన్ని వారాలుగా సూర్యుడిలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయాన్ని టెలిస్కోపులు గుర్తించాయి. సూర్యుడి ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిన విషయాన్ని కూడా చూశాయి.
ఈ పరిణామం కారణంగా భూగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సూర్యుడిలో వేడి పెరగడం, భారీస్థాయిలో సౌర తుఫాన్లు సంభవించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో వైపు సూర్యుడిలో ఈ తరహా ఘటనలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి ఈ తరహా ఘటనలు జరుగుతుంటాయని వివరిస్తున్నారు.
Talk about Polar Vortex! Material from a northern prominence just broke away from the main filament & is now circulating in a massive polar vortex around the north pole of our Star. Implications for understanding the Sun’s atmospheric dynamics above 55° here cannot be overstated! pic.twitter.com/1SKhunaXvP
— Dr. Tamitha Skov (@TamithaSkov) February 2, 2023
ఈ పరిణామాలకు సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు రకరకాల సాంకేతిక పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు గాని, ఎందులోనూ స్పష్టంగా దీన్ని వివరించి చెప్పలేకపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం