Artificial Intelligence: ఉద్యోగం కోసం ఏఐ పై ఆధారపడుతున్నారా..? ఈ స్టోరీ మీ కోసమే
ఈమధ్య కాలంలో సాఫ్‌వేర్ ఉద్యోగాలు సాధించడం అంటే అంత తేలిక కాదు. ఉన్న ఉద్యోగం ఊడిందా అంతే సంగతులు. పైగా ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. దీని సాయంతో ఏదైనా చేయొచ్చు అనుకంటే పొరబడినట్లే. ఒక ఐటీ ఉద్యోగికి ఎదురైన సంఘటనే దీనికి సరైన ఉదాహరణగా చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో సతమతమౌతోంది. అమెరికాలో బ్యాంకులు కుప్పకూలిన పరిస్థితి.

ఈమధ్య కాలంలో సాఫ్‌వేర్ ఉద్యోగాలు సాధించడం అంటే అంత తేలిక కాదు. ఉన్న ఉద్యోగం ఊడిందా అంతే సంగతులు. పైగా ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. దీని సాయంతో ఏదైనా చేయొచ్చు అనుకంటే పొరబడినట్లే. ఒక ఐటీ ఉద్యోగికి ఎదురైన సంఘటనే దీనికి సరైన ఉదాహరణగా చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో సతమతమౌతోంది. అమెరికాలో బ్యాంకులు కుప్పకూలిన పరిస్థితి. దీని ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఇంకేముంది ప్రాజెక్టులు కరువయ్యాయి. తద్వారా లేఆఫ్స్ ఎక్కువైపోయాయి. ఉద్యోగం ఊడిపోయిన ఒక టెక్కీ తన సహజ మేధస్సును కృత్తిమ మేధ (ఏఐ)పై పెట్టాడు.
ఇతని పేరు జూలియన్ జోసెఫ్. యూజర్ ఇంటర్‌ఫేస్ ఆటోమెషిన్‌లో విధులు నిర్వహించారు. లేఆఫ్స్ కారణంగా రెండు సంవత్సరాల్లో రెండు ఉద్యోగాలు కోల్పోయాడు. మరో ఉద్యోగాన్ని సాధించడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడి రెజూమ్ తయారు చేసుకున్నాడు. లేజీ అప్లయ్ వెబ్ పోర్టల్లో లాగిన్ అయ్యాడు. ఇక్కడ తన పేరు నమోదు చేసి అనుభవాన్ని పొందుపరిస్తే సరిపోతుంది. ఏఐ జాబ్‌జీపీటీ అతను ఇచ్చిన వివరాల ఆధారంగా అవసరమైన, ఉపయోగకరమైన ఉద్యోగాలను చూపిస్తుంది. ఇందు కోసం నెలకు 250 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే అనేక ఉద్యోగాలు నోటిఫికేషన్ రూపంలో వచ్చాయి.
ఇందులో భాగంగా5000లకు పైగా కంపెనీల్లో 300 జాబ్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 20 సంస్థల నుంచి ఇంటర్వూ కల్స్ వచ్చాయి. దీంతో కంగుతిన్న జోసెఫ్ ఏఐ టెక్నాలజీని చూసి నివ్వెరపోయాడు. ఇన్ని వేల కంపెనీలకు గానూ 20 కాల్స్ రావడం ఏంటని షాక్ అయ్యడు. పైగా ఇంటర్వూలో అడిగే ప్రశ్నలను కూడా ఏఐ ద్వారా సమాధానం పొందేందుకు ప్రయత్నించారు. అవి సరైన సమాధానాలు అందించడంలో మెరిగైన పాత్ర పోషించలేదు. దీంతో ఏ ఇంటర్వూలోనూ సెలెక్ట్ కాలేదు. కొత్త ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యనని తెలిపాడు. ఈ ప్రక్రియ ద్వారా అతనికి ఒక విషయం బాగా అర్థమైంది. ఏఐ సాయంతో ఉద్యోగం పొందడం చాలా కష్టం. ఇంటర్వూ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుందని గమనించారు. అందుకే ఏఐ టెక్నాలజీని ఉపయోగించడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..