Call Fraud: మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయా.? జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న మార్గాల్లో ఫ్రాడ్ కాల్స్ ఒకటి. రకరకాల ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఓ కొత్త నేరమే వెలుగులోకి వచ్చింది. ప్రజలను బురిడి కొట్టించేందుకు కొత్త తరహా మోసానికి తెరతీశారు. కొన్ని రోజులుగా సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు ఫోన్ చేసి మోసం చేస్తున్నారు. వినియోగదారులకు ఫోన్ చేసి.. రెండు గంటల్లో మీ సిమ్ కార్డ్ సర్వీస్...

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో నేరగాల్లు ప్రజల డబ్బులను కొల్లగొడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని అవతలి వారి ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న మార్గాల్లో ఫ్రాడ్ కాల్స్ ఒకటి. రకరకాల ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఓ కొత్త నేరమే వెలుగులోకి వచ్చింది. ప్రజలను బురిడి కొట్టించేందుకు కొత్త తరహా మోసానికి తెరతీశారు. కొన్ని రోజులుగా సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు ఫోన్ చేసి మోసం చేస్తున్నారు. వినియోగదారులకు ఫోన్ చేసి.. రెండు గంటల్లో మీ సిమ్ కార్డ్ సర్వీస్ నిలిచిపోతుందని. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం విభాగం నుంచి కాల్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే సిమ్ సేవలు నిలిచిపోకూడదంటే.. వెంటనే కొన్ని వివరాలు వెల్లడించాలని అడుగుతున్నారు.
ఇందులో యూజర్లకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా కొన్ని రకాల మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలను నమ్మిన కొందరు యూజర్లు సైబర్ నేరగాళ్లు అడిగిన సమాచారాన్ని చెప్పేస్తున్నారు. దీంతో పలువురు మోసాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు యూజర్లను అలర్ట్ చేశారు.ఈ మేరకు యూజర్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం కీలక సూచన చేసింది.
ఇలాంటి ఫోన్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని చెబుతోన్న అధికారులు.. సిమ్ కార్డ్ సర్వీస్‌లను డాట్ నిలిపివేయదని స్పష్టం చేశారు. వాటికి సంబంధించి యూజర్లకు ఎలాంటి ఫోన్లు చేయదని, ఒకవేళ ఎవరైనా సిమ్ కార్డ్ సేవలు ఆగిపోతాయని మీకు ఫోన్ చేస్తే.. వెంటనే మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే టెలికం కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో యూజర్ల పర్సనల్ విషయాలు అడగవని తెలిపారు. ఒకవేళ ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..