Gmail Account: జీమెయిల్ ఖాతా డిలీట్ చేస్తానంటున్న గూగుల్.. కారణమేంటో తెలుసా..
మీరు కనుక మీ జీమెయిల్ ఖాతాను వినియోగించకపోతే లేదా రెండేళ్లు అంత కంటే ఎక్కువ కాలం నుంచి లాగిన్ కాకపోయినా అటువంటి ఖాతాలను శాశ్వతంగా డిలీట్ చేసేందుకు గూగుల్ చర్యలు తీసుకోనుంది. ఆ గూగుల్ ఖాతాతో లింక్ అయ్యి ఉన్న డ్రైవ్ ఫైల్స్, గూగుల్ డాక్స్, గూగుల్ క్యాలెండర్ ఆపాయింట్ మెంట్స్, గూగుల్ ఫోటోలు అవన్నీ కూడా ఆ మెయిల్ తో పాటే డిలీట్ అయిపోతాయి.
గూగుల్ ఓ కీలకమైన ప్రకటన చేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ ప్రారంభంలో జీమెయిల్ ఖాతాలు డిలీట్ చేస్తామని ప్రకటించింది. అదెంటి జీమెయిల్ డిలీట్ చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? కంగారు పడకండి.. అన్ని జీమెయిల్స్ కాదు లెండి. మీరు కనుక మీ జీమెయిల్ ఖాతాను వినియోగించకపోతే లేదా రెండేళ్లు అంత కంటే ఎక్కువ కాలం నుంచి లాగిన్ కాకపోయినా అటువంటి ఖాతాలను శాశ్వతంగా డిలీట్ చేసేందుకు గూగుల్ చర్యలు తీసుకోనుంది. ఆ గూగుల్ ఖాతాతో లింక్ అయ్యి ఉన్న డ్రైవ్ ఫైల్స్, గూగుల్ డాక్స్, గూగుల్ క్యాలెండర్ ఆపాయింట్ మెంట్స్, గూగుల్ ఫోటోలు అవన్నీ కూడా ఆ మెయిల్ తో పాటే డిలీట్ అయిపోతాయి. అయితే మీరు రెగ్యూలర్ గా ఉపయోగించే జీమెయిల్ ఖాతాలు మాత్రం ఏమీ కాదని ప్రకటించింది. ఉపయోగించని ఖాతాలు డిలీట్ చేయడానికి ప్రధాన కారణం సెక్యూరిటీ అని గూగుల్ ప్రకటించింది. అవి హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉండటం, అలాగే సర్వర్ మెమరీని కూడా ఎక్కువ వినియోగిస్తుండటంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎవరు ఆందోళన చెందాలి..
మీరు ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ ఖాతాలు కలిగి ఉండి.. వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే వినియోగిస్తూ.. మిగిలిన ఖాతాలను పట్టించుకోకపోతే అవి డిలీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఉపయోగించని ఖాతాలు కూడా మీకు అవసరం అయితే మరెలా? ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఉపయోగించని ఆ జీమెయిల్ ఖాతాలకు లింక్ అయ్యి ఉన్న రికవరీ ఈమెయిల్ అడ్రస్ లకు గూగుల్ కొన్ని నోటిఫికేషన్లు పంపుతుంది. కొన్ని నెలల్లో మీ ఉపయోగించని ఖాతా డిలీట్ కాబోతోంది అని మెయిల్స్ చేస్తుంది. అప్పుడు అలెర్ట్ అయ్యి దానిని ఒకసారి మీరు ఎక్కువ కాలం నుంచి ఉపయోగించని లాగిన్ చేస్తే ఆ అకౌంట్ డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చు.
హ్యాకింగ్ బారి నుంచి కాపాడేందుకు..
గూగుల్ చెబుతున్న దాని ప్రకారం ఉపయోగించని జీమెయిల్ లకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఉండే అవకాశం చాలా తక్కువ. అటువంటి ఖాతాలు సులభంగా హ్యాకింగ్ కు గురవతాయి. అందువల్ల హ్యాకర్లకు ఇవి ప్రధాన టార్గెట్ అయ్యే అవకాశం ఉందని గూగుల్ చెబుతోంది. అందుకే ఎక్కువ కాలం నుంచి ఉపయోగించని జీమెయిల్ ఖాతాలను శాశ్వతంగా డిలీట్ చేయడం ద్వారా ఈ హ్యాకింగ్ థ్రెడ్ ను నివారించవచ్చని భావిస్తోంది.
మీరేం చేయాలి..
మీకు ఒకవేళ అలాంటి అకౌంట్లు ఉండి ఉంటే.. దానిలో ఏమైనా ఉపయోగపడే డేటా ఉంటే దానిని వెంటనే బ్యాక్ అప్ చేసుకోవడం మంచిది. ఆ విషయమై మీరు త్వరపడాల్సిన అవసరం ఉంది. ముందుగా మీ పాత జీమెయిల్ ఖాతాను వెంటనే లాగిన్ చేయడం లేదా గూగుల్ సర్వీస్ ను ఉపయోగించి ఆఖాతాను యాక్టివ్ చేసుకోవాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..