- Telugu News Photo Gallery Technology photos Vivo offering huge discounts on its smartphone for this diwali sale
Vivo Diwali offer: దీపావళికి అదిరిపోయే సేల్.. వివో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్..
దీపావళి పండుగ నేపథ్యంలో ఈ కామర్స్ సైట్స్ భారీ సేల్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ సైతం అదిరిపోయే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సైతం ప్రత్యేకంగా ఆఫర్‌ను అందిస్తోంది. దీపావళి సేల్‌లో భాగంగా తమ బ్రాండ్‌కు చెందిన ఫోన్‌లపై డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. నవంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Nov 11, 2023 | 9:47 PM

వివో వై సిరీస్ ఫోన్‌లపై కూడా మంచి డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. వివో వై 200 స్మార్ట్ ఫోన్‌పై రూ. 2500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వివో వై56, వివో వై27 స్మార్ట్ ఫోన్లపై రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా, వన్ కార్డు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ కార్డులపై ఈ ఆఫర్స్ పొందొచ్చు.

వివో వై27 స్మార్ట్ ఫోన్‌ను సులభమైన ఈఎంఐ విధానంలో కొనుగోలు చేయొచ్చు. రూ. 101 ఈఎమ్‌ఐతో సొంతం చేసుకోవచ్చు. వివో వీ-షీల్డ్ ప్లాన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

ఈ సేల్‌లో భాగంగా వివో ఎక్స్ 90 సిరీస్‌పై మంచి ఆఫర్లు అందిస్తోంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, వన్ కార్డులతో ఈ సిరీస్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే రూ. 10 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఇక వివో వీ29, వివో వీ29 ప్రో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. పైన తెలిపిన కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 4000 వరకు డిస్కౌంట్స్ లభించనుంది. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 8 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్‌లపై ఏకంగా రూ. 18 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

వీవో వీ29ఈ స్మార్ట్ ఫోన్ కోనుగోలుపై రూ. 2000 వరకు అదనంగా డిస్కౌంట్ అందించనున్నారు. వీటితోపాటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2500 వరకు పొందొచ్చు.




