- Telugu News Photo Gallery Technology photos Google will delete gmail accounts which are not using from past 2 years
Gmail: ఈ పని చేయకపోతే మీ జీమెయిల్ అకౌంట్ డిలీట్ అవుతుంది..
ప్రస్తుతం దాదాపు అందరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించాలంటే కచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉండాల్సిందే. దీంతో ప్రతీ ఒక్కరూ అనివార్యంగా జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తున్నారు. అయితే చాలా మంది మెయిల్‌ను ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తుంటారు. మనలో చాలా మంది ఇలానే చేస్తుంటారు. మీలాంటి వారి కోసమే గూగుల్ షాకింగ్ న్యూస్ చెప్పింది. మెయిల్ ఓపెన్ చేయని అకౌంట్స్‌ను డిలీట్ చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది..
Updated on: Nov 11, 2023 | 8:41 PM

ఒకప్పుడు జీమెయిల్ అకౌంట్‌ను కేవలం కొందరు మాత్రమే పయోగించేవారు. అయితే స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరూ జీమెయిల్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు.

అయితే అకౌంట్ క్రియేట్ చేసిన వారంతా ఉపయోగిస్తున్నారా అంటే కచ్చితంగా అవునని సమాధానం మాత్రం చెప్పలేని పరిస్థితి. పేరుకు జీమెయిల్ అకౌంట్ ఉన్నా నిత్యం ఉపయోగించే వారి సంఖ్య మాత్రం తక్కువేనని చెప్పాలి.

ప్రస్తుతం ఇలాంటి అకౌంట్స్‌పైనే దృష్టిసారించింది గూగుల్.. రెండేళ్లుగా నిరూపయోగంగా ఉన్న అకౌంట్లను శాశ్వతంగా తొలగించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ విషయాన్ని మే నెలలో గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. వచ్చే నెల నుంచి దశల వారీగా ఖాతాలను డీయాక్టీవేట్ చేయనున్నారు.

గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా జీమెయిల్ లాగిన్ కానీ అకౌంట్లను డీయాక్టివేట్ చేయనున్నారు. అలాగే డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, ఫొటోలతో సహ ఇతర కంటెంట్ మొత్తాన్ని తొలగిస్తుంది. ఎక్కువ కాలం లాగిన్ కానీ అకౌంట్లకు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండదు. దీంతో ఈ అకౌంట్స్‌ను ఇతరులు ఉపయోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లు, బిజినెస్‌లకు సంబంధించిన అకౌంట్స్‌ను మాత్రం డీయాక్టివేట్ చేయడం లేదని తెలిపింది. యూజర్ల అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలంటే ఈ రెండేళ్ల కాలంలో ఒక్కసారైనా లాగిన్ అయి ఉండాలి. లేదా మెయిల్ పంపడం, ప్లేస్టోర్ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, ఇదే ఖాతాతో యూట్యూబ్ చూడటం వంటివి చేయాలి.




