- Telugu News Photo Gallery Technology photos Flipkart diwali sale huge discount on Google Pixel 7 Pro smart phone, Check here for price and features
Google Pixel 7 Pro Offer: గూగుల్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ. 37వేలు డిస్కౌంట్..
ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ కామర్స్ సైట్స్ పలు డిస్కైంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ సేల్స్‌ను అందిస్తున్నాయి. ఇక ప్రముఖ సెర్జింజన్ దిగ్గజం గూగుల్ సైతం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. గూగుల్‌కు చెందిన పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 11, 2023 | 2:07 PM

గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 74,999గా ఉంది. లాంచింగ్ ధరతో పోల్చితే ఇది రూ. 14,000 తక్కువ. ఒకవేళ ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 37,100 డిస్కౌంట్ పొందొచ్చు. అన్ని ఆఫర్లుపోగా ఈ ఫోన్‌ను రూ. 37,300కి సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్లు ఇంతటితో ఆగిపోలేదు.. కాంబో ఆఫర్‌లో భాగంగా గూగుల్ ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేస్తే గూగూల్ పిక్సెల్ 7 ప్రోపై అదనంగా 25 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 27,975కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌పై గూగుల్ పిక్సెల్ 7 ప్రో రన్ కానుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 48 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీల కోసం 10.8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2 వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈ ఫోన్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.





























