Apple Diwali Sale: యాపిల్ ఉత్పత్తులపై అదిరే డీల్స్.. ఏకంగా 50శాతం వరకూ డిస్కౌంట్.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..
మీరు యాపిల్ వస్తువులు వాడాలని కలలు కంటున్నారా? అయితే మీ బడ్జెట్ సరిపోదని మిన్నకుండిపోతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దివాళి ఫెస్టివల్ సేల్స్ లో భాగంగా యాపిల్ అదిరే డీల్స్ ప్రకటించింది. ఏకంగా 50శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్ వంటి వాటిపై ఈ తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

దీపావళి పండుగ సమీపిస్తోంది. ఈ క్రమంలో అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైలర్లు తమ ఉత్పత్తులపై పలు ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటివి దివాళి సేల్ పేరిట వివిధ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. అనేక కంపెనీలకు చెందిన విభిన్న వస్తువులపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే క్రమంలో దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ కూడా తన ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ప్రకటంచింది. ఆన్ లైన్ తో పాటు యాపిల్ స్టోర్లలో కూడా ఈ ఫెస్టివ్ డీల్స్ అందిస్తోంది. మన దేశంలోని వినియోగదారులు ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్ వంటి వాటిపై అదిరే డిస్కౌంట్లు పొందొచ్చు. ఈ టెక్ జెయింట్ మొట్టమొదటి సారిగా ముంబైలోని యాపిల్ బీకేసీ, ఢిల్లీలోని యాపిల్ సాకెట్ నుంచి తన ఉత్పత్తులపై డైరెక్ట్ సేల్స్ ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆఫర్లు వీటిపైనే..
దివాళి ప్రమోషన్లలో భాగంగా ఎయిర్ పాడ్స్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్లు పొందొచ్చు. వీటిపై దాదాపు 50శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మీరు ఒకవేళ యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ తో పాటు మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ చేయాలనుకుంటే వీటిపై మీకు 50శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ 2021లో మార్కెట్లోకి వచ్చాయి. వీటి వాస్తవ ధర రూ. 20,900గా ఉంది. అయితే ఈ దివాళి సేల్లో మీరు దీనిని సగం ధరకే కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 14 ప్రో బేస్ మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ. 79,900కాగా డీల్ లో భాగంగా దీనిని 69,900కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ సామర్థ్యాలలో అందుబాటులో ఉంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటాయి.
యాపిల్ మ్యూజిక్ కు ఆరు నెలల సబ్ స్క్రిప్షన్.. డిస్కౌంట్ కు అదనంగా యాపిల్ ఓ ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి యాపిల్ మ్యూజిక్ కు ఆరు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
కార్డు ఆఫర్లు..
పలు బ్యాంకు కార్డులపై తక్షణ తగ్గింపులు, క్యాష్ బ్యాక్ లు యాపిల్ అందిస్తోంది. ఏవైనా రెండు వస్తువులు కొంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 90 రోజుల సేల్స్ కాలంలో ఈ ఆఫర్ పనిచేస్తుంది. అలాగే అర్హత ఉన్న వినియోగదారులకు మూడు, ఆరు నెలల కాల పరిమితితో ఉచిత ఈఎంఐలు కూడా పొందొచ్చు.
ఐప్యాడ్, ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్, యాపిల్ పెన్సిల్(రెండో జనరేషన్) వంటివి కొనుగోలు చేసే వినియోగదారులకు పలు ఉచిత ఫీచర్లను పొందొచ్చు. వాటిల్లో ఉచిత ఎన్ గ్రేవింగ్ ఒకటి. దీని సాయంతో విభిన్న రకాల అక్షరాలు, సంఖ్యలు, ఇమోజీలు, హిందీ, బెంగాలి, మరాఠీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, తెలుగు, ఇంగ్లిష్ వంటి భాషల్లో మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..