Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Diwali Sale: స్మార్ట్ టీవీ కొనాలంటే ఇది బెస్ట్ టైం.. అతి తక్కువ ధరకే క్యూఎల్ఈడీ దొరకుతోంది..

ఈ పండుగల సీజన్లో మీ ఇంట్లోని పాత టీవీని అప్ డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ నడుస్తున్నాయి. దీనిలో మీకు స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. మంచి డిజైన్, పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు కలిగిన టీవీలు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్లయిన సోనీ, శామ్సంగ్, రెడ్మీ, ఎంఐ, వన్ ప్లస్ వంటి కంపెనీలకు చెందిన టీవీ అతి తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.

Amazon Diwali Sale: స్మార్ట్ టీవీ కొనాలంటే ఇది బెస్ట్ టైం.. అతి తక్కువ ధరకే క్యూఎల్ఈడీ దొరకుతోంది..
Hisense 4k Qled Android Tv
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2023 | 10:35 PM

ఈ పండుగల సీజన్లో మీ ఇంట్లోని పాత టీవీని అప్ డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ నడుస్తున్నాయి. దీనిలో మీకు స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. మంచి డిజైన్, పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు కలిగిన టీవీలు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్లయిన సోనీ, శామ్సంగ్, రెడ్మీ, ఎంఐ, వన్ ప్లస్ వంటి కంపెనీలకు చెందిన టీవీ అతి తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ సైజ్ నుంచి కుటుంబం మొత్తం కలిసి వీక్షించగలిగేలా పెద్ద సైజ్ ఉన్న స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లు ఉన్నాయి. టీవీలపై ఈ దివాళి ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

సోనీ బ్రేవియా 65 అంగుళాల ఎక్స్74కే 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఈ టీవీ 164 సెంటీమీటర్లు అంటే 65 అంగుళాల పరిమాణంలో ఉండే 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ. దీనిలో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీపై మూడేళ్ల కాంప్రిహెన్సివ్ వారంటీ అందుబాటులో ఉంటుంది. ఈ టీవీని అమెజాన్లో రూ. 71,490 కి కొనుగోలు చేయొచ్చు. ఇదే టీవీ ఇవే ఫీచర్లతో 55 అంగుళాల పరిమాణంలోనిది రూ. 56,490కి వస్తుంది.

శామ్సంగ్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ.. ఈ టీవీ చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ క్యూఎల్ఈడీ 4కే హెచ్ డీ స్మార్ట్ టీవీలో క్వాంటమ్ కలర్స్, విభిన్న కాంట్రాస్ట్ తో కొత్త వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఐఓటీ సెన్సార్స్, సీనిక్ ఇంటెలిజెన్స్, సోలార్ సెల్ టెక్నాలజీతో సులభమైన కంట్రోల్ ఉంటుంది. వినియోగదారులు పాత టీవీని ఎక్స్ చేంజ్ చేసుకుంటే రూ. 5,500 వరకూ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ లో ఈటీవీని కార్డు ఆఫర్లతో కలిపి రూ. 56,490కి కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంఐ 32 అంగుళాలు.. ఇది హెచ్ డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ. ఇది మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అత్యంత చవకైన ధరలో లభించే హెచ్ డీ టీవీ ఇది. దీనిలో ప్యాచ్ వాల్ ప్లస్, 20వాట్ల స్పీకర్స్, గూగుల్ టీవీ వంటివి అందుబాటులో ఉంటాయి. అమెజాన్ దీనిని కేవలం రూ. 9,899 కే సొంతం చేసుకోవచ్చు.

హై సెన్స్ 43 అంగుళాలు.. మీరు అనువైన ధరలో క్యూఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్నట్లు అయితే ఇదే మీకు బెస్ట్ చాయిస్. ఇది 4కే అల్ట్రా హెచ్ డీ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ ఇది. దీనిలో లైట్ సెన్సింగ్, డాల్బీ విజన్, ఆటో ల్యాటెన్సీ మోడ్, ఆటో అడాప్టివ్ హెచ్ డీఆర్ వంటి ఫీచర్లు ఉంటాయి. వినియోగదారులకు ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంటుంది. ఈ టీవీపై మూడేళ్ల వారంటీ ఉంటుంది. ఈటీవీని మీరు కేవలం రూ. 25,249కే కొనుగోలు చేయొచ్చు.

టీసీఎల్ 43 అంగుళాలు.. ఇది 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ. దీనిలో డాల్బీ విజన్ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఏఐపీక్యూ ఇంజిన్ 3.0, ఎంఈఎంసీ అల్గారిథమ్ ఉంటుంది. దీనివల్ల మోషన్ డిస్ ప్లే బ్లర్ అవకుండా చేస్తుంది. ఏఎండీ ఫ్రీ సింక్ టెక్నాలజీ, టీసీఎల్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ అర్టిఫ్యాక్ట్ ఫ్రీ గేమ్ ప్లే ఉంటుంది. పాత టీవీ ఎక్స్ చేంజ్ పై రూ. 5,500 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిని మీరు కేవలం రూ. 23,990కే కొనుగోలు చేయొచ్చు. ఇదే టీసీఎల్ 55అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూ ఎల్ఈడీ గూగుల్ టీవీ అమెజాన్లో రూ. 33,990కి అందుబాటులో ఉంది.

వన్ ప్లస్ 43 అంగుళాల వై సిరీస్.. ఇది 4కే అల్ట్రా హెచ్ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ. ఇది వన్ ప్లస్ 43వై1ఎస్ ప్రో(బ్లాక్) పేరుతో ఉంది. దీనిలో వన్ ప్లస్ ఎకో సిస్టమ్, గూగుల్ అసిస్టెంట్, 1 బిలియన్ కలర్స్ వంటివి ఉన్నాయి. వినియోగదారులు ఆరు నెలల కాల వ్యవధితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఇన్ స్టాలేషన్ కూడా ఉచితంగా పొందొచ్చు. దీని ధర అమెజాన్లో రూ. 23,749గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..