Brain Health: మీ బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ కచ్చింతంగా మీ డైట్‌లో ఉండాల్సిందే!
మనం తీసుకునే ఆహారం మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచడానికి కొన్ని పోషకాలున్న ఆహారాలు అవసరం. మెగ్నీషియం, జింక్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడును చురుకుగా ఉంచి, పిల్లల మెదడు అభివృద్ధికి తోల్పడుతాయి. కాబట్టి ఈ కథనంలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఆహారాల గురించి తెలుసుకుందాం..

మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలన్నా.. మనం తీసుకునే ఆహారంమే అందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు మతిమరపుతో బాధపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మొదడు పనితీరు మందగించడం. ఈ సమస్యను అదిగమించాలంటే మనం మెదడుకు కావాల్సి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మన మెదడు ఆరోగ్యానికి దోహదపడే పోషకాలు ఏవి.. వాటిని ఎలాంటి ఆహారాల పదార్ధాల ద్వారా పొందవచ్చు. అవి మన మొదడు పనితీరుకు ఎలా దోహదపడుతాయో ఇక్కడ తెలుసుకుందాం
మొదడు పనితీరును పెంచే పోషకాలు, ఖనిజాలు లభించే ఆహారపదార్థాలు
మెగ్నిషియం: ఇది మన మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మెగ్నిషియం ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా మన మొదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పోషకం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల విషయానికి వస్తే.. ముఖ్యంగా ఆకుకూరలు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంటాయి. అవును పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని మీరు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ మెదడును షార్ప్‌గా ఉంచుకోవచ్చు. ఇదే కాదు బీన్స్, చిక్కుళ్లు, బఠానీలు వంటి ఆహార పదార్ధాల్లో సైతం మెగ్నిషియం అధికంగా ఉంటుంది. వీటని మీ డైట్‌లో ఉండేట్టు చూసుకుంటే.. మీ బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది.
జింక్: జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మరో పోషకం జింక్. ఈ పోషకం ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అల్జీమర్స్, మతిమరుపు, వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ ఖనిజం ఎక్కువగా అభించే ఆహారపదార్థాల విషయానికి వస్తే గుమ్మడి గింజలు, రెడ్ మీట్, రొయ్యలు వంటి వాటిలో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహార పదార్థాలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ మొదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు: మొదడును ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చాలా ప్రభావంగా పనిచేస్తాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు సాధారణ మానసిక సమస్యలను సైతం దూరం చేస్తాయి. ఈ కొవ్వు అమ్లాలు మనకు చేపలు, వాల్‌నట్స్, సోయాబీన్స్, కనోలా నూనె, చియా గింజలు, సాల్మన్ చేపలు, అవిసె గింజలు వంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆహార పదార్థాలను మన డైట్‌లో ఉంచుకుంటే మన మొదడు సూపర్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా మతిమరపుతో బాధపడేవారు వీటిని తినడం చాలా ముఖ్యం. ఇంకా మీ పిల్లల డైట్‌లో వీటిని చేర్చుతే వారి బ్రెయిన్ కూడా కంప్యూటర్‌లా స్పీడ్‌గా పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
