Health Tips: బీపీని కంట్రోల్ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే ఆరోగ్యం మీ వెంటే!
మారుతున్న జీవనశైలితో బీపీ, షుగర్ సమస్యలు పెరుగుతున్నాయి. మందులతో పాటు, కొన్ని సహజ ఆహారాలతో వీటిని నియంత్రించవచ్చు. కొవ్వు చేపలు, ఆకుకూరలు, బెర్రీలు, కివి, పప్పు ధాన్యాలు వంటివి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

మారుతున్న ఆహరపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో బీప అనేది ప్రధాన సమస్య. అయితే దీనిని తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల మందులను వాడుతారు. కానీ మన పరిసరాల్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకోవడం ద్వారా దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును మన ఆరోగ్యం అనేది ఎల్లప్పుడూ మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడాయి. అవేంటో తెలుసుకుందాం.
రక్తపోటును నియంత్రించే ఐదు సూపర్ ఫుడ్స్
కొవ్వు చేపలు: కొవ్వు చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్త నాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఈ చేపలను తినడం వల్ల రక్త నాళాలలో నైట్రేట్లు పేరుకుపోకుండా సహాయపడుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
ఆకుకూరలు: పాలకూర వంటి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించి, మన శరీరంలోని అదనపు సోడియంను సమతుల్యం చేస్తాయి. ఈ ఆకుకూరలను మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బెర్రీలు: మీ ఆహారంలో బెర్రీలను చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మీరు స్ట్రాబెర్రీలను తినడం వల్ల వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలను సడలించడంలో సహాయపడతాయి. ఈ పండ్లు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి.
కివి: కివి పండు రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచుతుంది. ఇది ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. ఈ కివి పండు రుచికి తీపి, పుల్లగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఇవే కాకుండా శనగలు, బీన్స్ వంటి పప్పు ధాన్యాలను కూడా రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మీరు మార్నింగ్ లేదా ఈవినింగ్ వీటిని స్నాక్స్‌గా తీసుకున్నా వాటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ ధాన్యాలను తినడం ద్వారా తగినంత ఫైబర్ పొందవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్త నాళాల పనితీరును మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించలేదు. వీటిపై మేకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
