AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఏడాది వేళ ప్రజలకు మరో షాక్.. పెరగనున్న వాటి ధరలు..! జనవరి నుంచే అమల్లోకి..

ఇప్పట్లో సామాన్యులు కూడా తమ ఇంట్లో ఏసీలు వాడుతున్నారు. ఏసీ వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు చాలామంది ఇళ్లల్లో ఏసీలు ఉంటున్నాయి. త్వరలో ఏసీల ధరలు కూడా పెరగనున్నాయని తెలుస్తోంది. కొత్త ఏడాది జనవరిలోనే ఈ పెంపు చూడవచ్చు.

కొత్త ఏడాది వేళ ప్రజలకు మరో షాక్.. పెరగనున్న వాటి ధరలు..! జనవరి నుంచే అమల్లోకి..
AC Prices
Venkatrao Lella
|

Updated on: Dec 28, 2025 | 4:10 PM

Share

AC Prices Hike: మధ్యతరగతి ప్రజలకు త్వరలో మరో షాక్ తగలనుంది. కొత్త ఏడాది వస్తున్న క్రమంలో అనేక వస్తువులు ధరలు పెరగనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనం కావడంతో అనేక వస్తువుల ధరలు పెరగననున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరల కొత్త ఏడాదిలో ఆశాకాన్నంటనున్నాయి. నూతన సంవత్సరంలో ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. మొబైల్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ధరలతో పాటు ఏసీ ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పెరగనున్న ఏసీ ధరలు

వచ్చే ఏడాది జనవరి నుంచి ఏసీ ధరలు 3 నుంచి 12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ను ఎక్కువగా ఉపయోగించే 3 స్టార్ ఏసీల ధరలు 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశముండగా. . విద్యుత్‌ను తక్కువగా వినియోగించే 5 స్టార్ ఏసీల ధరలు ఏకంగా 12 శాతం పెరగనున్నాయి. ఈ ఏడాది దేశంలోనే విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీని వల్ల ఏసీలను ఎక్కువమంది కొనుగోలు చేయలేదు. దీని వల్ల ఏసీలను తయారుచేయడానికి ఉపయోగించే వస్తువులు కంపెనీల వద్ద అలాగే మిగిలి ఉన్నాయి. కొనుగోళ్లు ఎక్కువగా జరక్కోవడం వల్ల ఏసీల నిల్వలు డీలర్ల వద్ద అలాగే ఉన్నాయి. అలాగే జనవరి నుంచి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తెస్తున్న కొత్త నిబంధనలు కూడా ఏసీల ధరలు పెరగడానికి కారణామవుతున్నాయి.

జనవరి 1 నుంచి కొత్త రూల్స్

జనవరి 1 నుంచి మరింత నాణ్యమైన వస్తువులను మాత్రమే ఏసీ తయారీకి ఉపయోగించాలని బీఈఈ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. దీని వల్ల ఏసీల తయారీకి ఉపయోగించే లోహలు, ఇతర ముడి పదార్ధాలను నాణ్యతతో కూడుకున్నవి ఉపయోగించాల్సి ఉంటుంది. నాణ్యత గల వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కంపెనీలపై మరింత భారం పడటం వల్ల ఏసీల ధరలను పెంచనున్నారు. ఇటీవల జీఎస్టీ రేట్ల తగ్గింపు క్రమంలో ఏసీల ధరలు కాస్త తగ్గాయి. కానీ కంపెనీలు తమపై పడే భారం తగ్గించుకునేందుకు ప్రజలపై భారం వేసేందుకు సిద్దమవుతున్నాయి. జనవరి నుంచే ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..