WhatsApp Chats: వాట్సాప్ యూజర్స్ అలర్ట్.. ఇకపై ఆ ఫీచర్ ఉచితం కాదు.. అదనంగా కొనుక్కోవాల్సిందే..
ఈ సంవత్సరం మొదటి అర్థ భాగంలో ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తామని వాట్సాప్ ప్రకటించింది. చాట్ బ్యాకప్‌లు వినియోగదారుల గూగుల్ డిస్క్ స్టోరేజ్ పరిమితులకు లోబడి ఉంటాయి. ఇప్పటి వరకూ కేవలం ఈ ఉచిత 15జీబీ స్టోరేజ్ పైనే ఆధారపడే వారిపై దీని ప్రభావం పడనుంది. వాట్సాప్ లో తమ విలువైన జ్ఞాపకాలు, సంభాషణలను కాపాడుకోవడానికి గూగుల్ డ్రైవ్ పై ఆధారపడే వ్యక్తులు ఆ ఉచిత డేటా స్పేస్ అయిపోతే గూగుల్ వన్లో అదనపు స్టోరేజ్ స్పేస్ ను కొనుగోలు చేయాల్సి వస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. ప్రతి రోజూ బిలియన్ల కొద్దీ వినియోగదారులు ఈ ప్లాట్ ఫారం ద్వారానే ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతుంటారు. యాప్ లోని ఫీచర్లు, సౌలభ్యం దీని గ్లోబల్ వైడ్ గా దీని డిమాండ్ ను మరింత పెంచుకుంటూ పోతుంది. వినియోగదారులకు అవసరమై అనేక సేవలను ఉచితంగానే అందించే వాట్సాప్.. కొత్త సంవత్సరంలో తన పంథా మార్చుకుంటోంది. ప్రస్తుతం వాట్సాప్ చాట్స్ కు సంబంధించిన బ్యాకప్ లను గూగుల్ డ్రైవ్ లో ఆటోమేటిక్ గా స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంది. దానికి గూగుల్ డిస్క్ లోని స్టోరేజ్ స్పేస్ కు సంబంధం లేకుండా చాట్ లను బ్యాకప్ చేసేది. అంటే గూగుల్ డ్రైవ్ లో 15జీబీ ఉచిత డేటా స్టోరేజ్ ను గూగుల్ అందిస్తుంది. ఈ స్పేస్ తో సంబంధం లేకుండా ఇప్పటి వరకూ వాట్సాప్ చాట్ బ్యాకప్ చేసేది. అయితే ఈ ఏడాది నుంచి దీనిని మార్చుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇకపై వాట్సాప్ చాట్ బ్యాకప్స్ కూడా గూగుల్ డిస్క్ స్టోరేజ్ పరిమితులకు లోబడే ఉంటాయని పేర్కొంది. అంటే ఉచితంగా అందించే 15జీబీ లోపే స్టోరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు ముంచితే అదనంగా స్పేస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నుంచే ప్రారంభం..
ఈ సంవత్సరం మొదటి అర్థ భాగంలో ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తామని వాట్సాప్ ప్రకటించింది. చాట్ బ్యాకప్‌లు వినియోగదారుల గూగుల్ డిస్క్ స్టోరేజ్ పరిమితులకు లోబడి ఉంటాయి. ఇప్పటి వరకూ కేవలం ఈ ఉచిత 15జీబీ స్టోరేజ్ పైనే ఆధారపడే వారిపై దీని ప్రభావం పడనుంది. వాట్సాప్ లో తమ విలువైన జ్ఞాపకాలు, సంభాషణలను కాపాడుకోవడానికి గూగుల్ డ్రైవ్ పై ఆధారపడే వ్యక్తులు ఆ ఉచిత డేటా స్పేస్ అయిపోతే గూగుల్ వన్లో అదనపు స్టోరేజ్ స్పేస్ ను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
గూగుల్ వన్ ప్లాన్లు ఇలా..
ఈ విధానం ఐఫోన్ ఇప్పటికే అమలుచేస్తోంది. ఐ క్లౌడ్ పేరిట ప్రత్యేక స్టోరేజ్ స్పేస్ లను అందిస్తోంది. దీని సరసన ఆండ్రాయిడ్ డివైజ్ లు కూడా చేరాయి. గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా అదనపు స్టోరేజ్ స్పేస్ ను మీరు డివైజ్లో కలిగి ఉండొచ్చు. గూగుల్ వన్ నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన మూడు ప్రధాన ప్లాన్లను అందిస్తుంది. నెలవారీ ప్లాన్లను గమనిస్తే.. బేసిక్ ప్లాన్(100జీబీ) దీని ధర 1.99డాలర్లు అంటే రూ. 165.82, స్టాండర్డ్ ప్లాన్(200జీబీ) ధర 2.99 డాలర్లు అంటే మన కరెన్సీలో ప్రీమియ ప్లాన్ 9.99డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.249.15, అలాగే ప్రీమియం ప్లాన్(2టీబీ) ధర 9.99డాలర్లు అంటే రూ. 832.48 ఉంటుంది. అదే సమయంలో వార్షిక ప్లాన్లను గమనిస్తే బేసిక్ ప్లాన్(100జీబీ) 19.99డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,665.79, స్టాండర్డ్ (200జీబీ) ప్లాన్ ధర 29.99 డాలర్లు అంటే రూ. 2,499.02, ఇక ప్రీమియం (2టీబీ) ప్లాన్ ధర 99 డాలర్లు అంటే రూ. 8,249.51గా ఉంటుంది.
స్టోరేజ్ ని తెలివిగా వాడుకోండి..
మీరు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే, మీ స్టోరేజ్‌ని తెలివిగా ఉపయోగించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఫోటోలు ఎక్కువ స్థలాన్ని వినియోగిస్తున్నందున.. మీరు వాట్సాప్‌ని ఓపెన్ చేసి, సెట్టింగ్స్ లోకి వెళ్లి, స్టోరేజ్, డేటా ఆప్షన్ పై క్లిక్ చేయండి. చివరగా స్టోరేజీ మెయింటెనెన్స్ ను ఎంచుకోండి. ఇక్కడ, వాట్సాప్ నిల్వ వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గించడానికి వివిధ పద్ధతులను అందిస్తుంద., అదనపు ఖర్చులు లేకుండా మీరు వారి ఉచిత 15జీబీ కేటాయింపును ఎక్కువగా ఉపయోగించుకునేలా చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




