Realme Note 50 4G: రూ. 7వేలలో సూపర్ ఫీచర్స్.. రియల్‌మీ నుంచి అదిరిపోయే ఫోన్..
ఈ 4జీ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆన్‌లైన్ వేదికగా కొన్ని ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను చాలా తక్కువ బడ్జెట్‌తో...

స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలన్నీ బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు బడ్జెట్ ధరలో ఫోన్‌లను లాంచ్ చేస్తూ వినిమోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్ నోట్ 50 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.
ఈ 4జీ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆన్‌లైన్ వేదికగా కొన్ని ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను చాలా తక్కువ బడ్జెట్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
రియల్‌మీ నోట్ 50 స్మార్ట్ ఫోన్ యూనిఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నట్లు సమాచారం. అలాగే 4జీ వరకు అదనంగా ర్యామ్‌ను ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇక రియల్‌మీ నోట్ 50 స్మార్ట్ ఫోన్ స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 66.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ ప్యానెల్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇక కెమెరా విషయానికొస్తే రియల్‌మీ నోట్ 50 స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా స్లాట్ కోసం వాటర్ డ్రాప్ నాట్చ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ రూ. 7 వేల నంచి రూ. 8 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లను త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే రియల్ మీ నుంచి ఇటీవలే రియల్‌మీ సీ67 స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 13,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




